Netflix Plan Prices : అయ్య బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ దేశాల్లోని యూజర్లు ఎక్కువ చెల్లించాల్సిందే..!

Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ కొత్త ధరల పెంపు భారతీయ వినియోగదారులకు వర్తించదు. ప్రస్తుతం ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో ఉపయోగించవచ్చు.

Netflix Plan Prices : అయ్య బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ దేశాల్లోని యూజర్లు ఎక్కువ చెల్లించాల్సిందే..!

Netflix increases prices

Updated On : January 22, 2025 / 10:20 PM IST

Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) మళ్లీ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ల ధరలను పెంచేసింది. అమెరికాతో సహా అనేక మార్కెట్లలో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ల కోసం ఎక్కువ చెల్లించక తప్పదు. అమెరికా, అర్జెంటీనా, కెనడా, పోర్చుగల్‌లలో బేసిక్, ప్రీమియం ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయని కంపెనీ ప్రకటించింది. కంటెంట్‌లో కొత్త పెట్టుబడులు పెడుతున్నామని, దీని కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. వినియోగదారులు ఇంతకు ముందు చెల్లించాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Realme GT 7 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి జీటీ 7ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ ఫోన్ కొనాలా వద్దా?

నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను వీక్షించడం అనేది ఇప్పుడు అమెరికాతో సహా అనేక ఇతర మార్కెట్‌లలోని వినియోగదారులకు మరింత ఖరీదైనదిగా మారబోతోంది. నెట్‌ఫ్లిక్స్ కొన్ని ఎంపిక చేసిన మార్కెట్‌లలో సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇందులో యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా, కెనడా, పోర్చుగల్ వంటి మార్కెట్లు ఉన్నాయి. అమెరికాలో కంపెనీ ప్రీమియం సభ్యత్వం ఇప్పుడు 25 డాలర్లు (సుమారు రూ. 2163)కి అందుబాటులో ఉంటుంది. అంటే.. 2 డాలర్లు పెరిగింది అనమాట.

అదే సమయంలో, స్టాండర్డ్ ప్లాన్ 18 డాలర్లకు (సుమారు రూ. 1557) అందుబాటులో ఉంటుంది. స్ట్రీమింగ్ కంటెంట్‌లో పెట్టుబడి పెట్టడమే ధరల పెంపునకు కారణమని కంపెనీ పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్ ప్రోగ్రామింగ్ క్వాలిటీని మెరుగుపర్చడంపైనే దృష్టి సారిస్తోంది. 2024 పండుగ సీజన్ ముగిసే నాటికి నెట్‌ఫ్లిక్స్ 1.9 కోట్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. కంపెనీకి ఇప్పుడు 30 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నట్లు సమాచారం. గతేడాది చేరిన మొత్తం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 4.1 కోట్లుగా అంచనా.

Netflix increases prices

Netflix Plan Prices

అయినప్పటికీ, యాడ్స్ కంటెంట్‌ను చూసే నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే, నెట్‌ఫ్లిక్స్ కొన్ని ప్లాన్‌లను తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ దాదాపు 70 మిలియన్ల మంది వ్యూయర్స్ ప్రతి నెలా యాడ్స్ కంటెంట్ వీక్షిస్తున్నారు. 2024 సంవత్సరంలో ఈ సంఖ్య మేతో పోలిస్తే.. నవంబర్ నాటికి దాదాపు రెట్టింపు అయింది. నెట్‌ఫ్లిక్స్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్ అందుబాటులో ఉన్న దేశాల్లో, 50 శాతం కన్నా ఎక్కువ మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లు ఎంచుకుంటున్నారు. ఈ టైప్ ప్లాన్ 12 దేశాల్లో అందుబాటులో ఉంది. కస్టమర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కంపెనీ రెండేళ్ల క్రితమే యాడ్-సపోర్టెడ్ టైర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త ధరల పెంపు భారతీయులకు వర్తించదు :
నెట్‌ఫ్లిక్స్ కొత్త ధరల పెంపు భారతీయ వినియోగదారులకు వర్తించదు. ప్రస్తుతానికి, భారతీయ వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగించవచ్చు. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం అనే నాలుగు ప్లాన్‌లను అందిస్తోంది. మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ. 149, 480p రిజల్యూషన్‌తో సరసమైన ధరకే వీడియో క్వాలిటీని అందిస్తుంది. ఏదేమైనప్పటికీ, ఈ ప్లాన్ ఒక డివైజ్‌‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. అంటే.. ఒక ఇంటిలో ఒక సమయంలో మొబైల్ లేదా టాబ్లెట్ లో మాత్రమే ఈ కంటెంట్ యాక్సస్ చేయగలరు.

భారత్‌లో బేసిక్ ప్లాన్ ధర రూ. 199 ఉంటే.. టీవీ, కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్ డివైజ్‌లకు 720p రిజల్యూషన్, సపోర్ట్‌ని అందిస్తోంది. అయితే, ఒక కుటుంబంలో ఒకేసారి ఒక డివైజ్ మాత్రమే యాక్సస్ చేయగలరు. స్టాండర్డ్ ప్లాన్ ధర రూ. 499, 1080p హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తుంది. అన్ని డివైజ్‌లకు సపోర్టు ఇస్తుంది. రెండు డివైజ్‌లకు ఒక ఇంటిలో ఏకకాలంలో యాక్సస్ చేసేందుకు అనుమతిస్తుంది. చివరగా, ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ. 649, 4K రిజల్యూషన్, స్పేషియల్ ఆడియో, ఒక ఇంటిలో ఏకకాలంలో గరిష్టంగా 4 స్ట్రీమింగ్ డివైజ్‌లకు సపోర్టు అందిస్తుంది. ఏ సమయంలోనైనా, కంటెంట్‌ను గరిష్టంగా 7 డివైజ్‌ల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : iPhone 15 Discount : రూ. 25 వేల కన్నా తక్కువ ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.. ఈ బంపర్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు..!