Samsung Galaxy S25 Ultra
Samsung Galaxy S25 Ultra : మీరు శాంసంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
Read Also : Honda Shine 100 : కొత్త బైక్ కావాలా? హోండా షైన్ బైక్ భలే ఉంది భయ్యా.. మైలేజీలో కింగ్.. మీ బడ్జెట్ ధరలోనే..!
ప్రస్తుతం ఈ శాంసంగ్ ఫోన్ డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో సమ్మర్ సేల్ సందర్భంగా ఈ 5జీ ఫోన్ తక్కువ ధరకే ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా డిస్కౌంట్ :
ధర విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,29,999కు పొందవచ్చు. అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మీరు ఆఫర్ల ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు.
బ్యాంక్ ఆఫర్ ద్వారా HDFC బ్యాంక్ కార్డ్‌పై రూ. 11వేలు తగ్గింపు పొందవచ్చు. మీరు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 86,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. మీరు రూ. 6,303 ఈఎంఐ ఆప్షన్ కూడా కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫీచర్లు :
శాంసంగ్ అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. డైనమిక్ అమోల్డ్ 2Xలో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz వద్ద సపోర్టు ఇస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది.
కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. 200MP మెయిన్ కెమెరా కూడా ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 50MP, 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది.
సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది. పవర్ కోసం ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.