Samsung Galaxy Z Fold 6 5G
Samsung Galaxy Z Fold 6 5G : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు నిజంగా ఫోల్డబుల్ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్.
శాంసంగ్ గెలాక్సీ మడతబెట్టే Z Fold 6 5G ఫోన్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లతో అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు ఈ శాంసంగ్ ఫోన్ కొనుగోలుపై రూ.38వేల కన్నా ఎక్కువ సేవింగ్ చేసుకోవచ్చు.
రూ.1,64,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ అమోల్డ్ స్క్రీన్, ట్రిపుల్ కెమెరా, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, ప్రీమియం డిజైన్ అందిస్తుంది. బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలని చూస్తుంటే.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర :
అమెజాన్‌లో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర రూ.1,28,000గా ఉంది. ఇప్పుడు రూ.36,999 తగ్గింది. HDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2వేలు ఆదా చేసుకోవచ్చు.
మొత్తం తగ్గింపు రూ.38,999 వరకు పెరుగుతుంది. అమెజాన్ నెలకు రూ.6,206 నుంచి ప్రారంభమయ్యే స్టాండర్డ్, నో-కాస్ట్ ఈఎంఐ రెండింటినీ యాక్సస్ చేయొచ్చు.
కస్టమర్లు తమ పాత ఫోన్లను రూ.72,300 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ వర్కింగ్ కండిషన్లు, మోడల్ ఎక్స్చేంజ్ చేస్తున్న ఫోన్ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు ఎక్స్‌టెండెడ్ వారంటీ, శాంసంగ్ కేర్ ప్లస్, డివైజ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఫోన్ 7.6-అంగుళాల ప్రైమరీ, 6.3-అంగుళాల కవర్ అమోల్డ్ డిస్ప్లేలతో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 Gen 3ని అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 4,400mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ 50MP ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. 10MP, 4MP సెల్ఫీ కెమెరాలను కూడా కలిగి ఉంది.