Jio Recharge Plan : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? జియోలో ఈ ప్లాన్‌తో 3 నెలలు ఎంజాయ్ చేయొచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio Recharge Plan : జియో రీఛార్జ్ ప్లాన్ తీసుకున్నారా? ఈ సింగిల్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి.

Jio Recharge Plans
Jio Recharge Plan : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్ అవసరం లేకుండా సింగిల్ రీఛార్జ్‌తో ఏకంగా మూడు నెలల పాటు ఎంజాయ్ చేయొచ్చు.
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో 460 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లతో టాప్ టెలికాం ప్రొవైడర్ రిలయన్స్ జియో వైడ్ రేంజ్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది.
నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయిన జియో యూజర్లకు లాంగ్ వ్యాలిడిటీ, OTT సబ్‌స్క్రిప్షన్‌లతో ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 1299 ధరతో 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఇదో గేమ్ ఛేంజర్ ప్లాన్ అని చెప్పొచ్చు.
లాంగ్ వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్ :
జియో రూ.1,299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అనేక మంది యూజర్లకు అందుబాటులో ఉంది. మొబైల్ ఫోన్‌లను తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. 84 రోజుల (సుమారు 3 నెలలు) వ్యాలిడిటీని అందిస్తుంది. జియో నెలవారీ రీఛార్జ్‌ల అవసరం ఉండదు.
డేటా అలవెన్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్ :
రూ.1299 ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 168GB డేటా లభిస్తుంది. ఈ డేటా అధిక డేటా అవసరం ఉన్న యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్లాన్ అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఎలాంటి కాల్ ఛార్జీలు లేకుండా పొందవచ్చు. రోజువారీ 2GB డేటా లిమిట్ తర్వాత 64kbps స్పీడ్ తగ్గుతుంది. స్లో ఇంటర్నెట్‌ను వినియోగదారులు యాక్సెస్ చేయొచ్చు.
అన్‌లిమిటెడ్ 5G డేటా :
జియో రూ.1299 ప్లాన్ ట్రూ 5G రీఛార్జ్ ప్లాన్. అర్హత కలిగిన 5G యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. ఎలాంటి డేటా పరిమితులు లేకుండా 5G కనెక్టివిటీని పొందవచ్చు. 5G నెట్‌వర్క్ హైస్పీడ్ డేటా వినియోగదారులకు ఈ ఫీచర్ ప్రత్యేకంగా ఉంటుంది.
ఎంటర్‌టైన్మెంట్ OTT సబ్‌స్క్రిప్షన్ :
డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్ డిమాండ్‌ను గుర్తించి జియో రూ.1299 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం విడిగా చెల్లించాల్సిన అవసరం లేదు.
అదనంగా, ఈ ప్లాన్‌లో జియోటీవీకి ఫ్రీ సభ్యత్వం కూడా అందిస్తోంది. వైడ్ రేంజ్ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ :
జియో రూ.1299 ప్లాన్‌లో 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది. వినియోగదారులకు ఫైల్స్, డేటా కోసం అదనపు స్టోరేజీని అందిస్తుంది.