ఐటీసీ కంపెనీ చైర్మన్‌గా సంజీవ్ పురిని నియమితులయ్యారు. శనివారం ఐటీసీ చైర్మన్ యోగేశ్ చందర్ దేవేశ్వర్ కన్నుమూసిన విషయం తెలిసిందే.దీంతో సంజీవ్ పురిని చైర్మన్ గా నియమిస్తూ బోర్డ్ డైరక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మేనేజింగ్ డైరక్టర్ గా ఉన్నారు.చైర్మన్ గా,ఎండీగా సంజీవ్ ఇకపై బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ తెలిపింది.ఐఐటీ కాన్పూర్ లో చదివిన సంజయ్ 1986లో కంపెనీలో చేరారు.డిసెంబర్ 2015లో ఆయన ఐటీసీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. ఆ తర్వాత 2017లో సీఈవోగా మారారు.
2018 నుంచి సంజీవ్ కంపెనీ మేనేజింగ్ డైరక్టర్‌గా ఉన్నారు.