SBI Home Loans : హోం లోన్ తీసుకున్నారా? రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ.. ఇక ఈఎంఐ ఎంత తగ్గుతుందంటే?

SBI Home Loans : ఎస్బీఐలో హోం లోన్లపై వడ్డీ రేట్లు తగ్గాయి. EBLR కూడా తగ్గింది. హోం లోన్లపై ఈఎంఐ భారం కూడా తగ్గనుంది.

SBI Home Loans

SBI Home Loans : ఎస్బీఐ హోం లోన్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం వడ్డీ రేట్లను తగ్గించింది. ఇటీవలే EBLR, హోం లోన్ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50శాతం) తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును తగ్గించిన తర్వాత ఎస్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. దాంతో హోం లోన్లతో పాటు పర్సనల్ లోన్లు చౌకగా మారనున్నాయి.

Read Also : SBI Interest Rates : SBI ఇలా షాకిచ్చిందేంటి..? ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఒకేసారి వడ్డీ రేట్లు తగ్గింపు..!

ఈబీఎల్ఆర్ (EBLR)అంటే ఏంటి? :
ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) అనేది బ్యాంకులు కస్టమర్లకు అందించే రుణాలపై వడ్డీ రేటును నిర్ణయించే వ్యవస్థ. ఈ రేటు నేరుగా ఆర్బీఐ రెపో రేటుతో లింక్ అయి ఉంటుంది.

ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే.. గృహ రుణాలు చౌకగా మారతాయి. వడ్డీ రేట్లు భారీగా తగ్గుతాయి. కస్టమర్లు కూడా హోం లోన్లు, పర్సనల్ లోన్లపై వడ్డీ తగ్గుతుంది.

ఎస్బీఐలో కొత్త EBLR, గృహ రుణ రేట్లు :
ఎస్బీఐ తమ కస్టమర్ల కోసం ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR) 8.65శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది. అంతేకాదు.. ఎస్బీఐ గృహ రుణ రేట్లను కూడా తగ్గించింది. వివిధ రుణ కేటగిరీలకు సంబంధించి ఈ కొత్త వడ్డీ రేట్లను ఎస్బీఐ విడుదల చేసింది.

గృహ రుణంపై వడ్డీ రేటు (టర్మ్ లోన్) ఇప్పుడు 7.50శాతం నుంచి 8.45% మధ్య ఉంటుంది. హోమ్ లోన్ మ్యాక్స్ గెయిన్ (ఓవర్ డ్రాఫ్ట్ మోడ్) వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 8.70శాతం వరకు ఉంటుంది.

టాప్ అప్ లోన్‌పై వడ్డీ రేటు 8.00 శాతం నుంచి 10.50 శాతం మధ్య ఉంటుంది. టాప్ అప్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్‌పై రేటు 8.25 శాతం నుంచి 9.20 శాతం వరకు ఉంటుంది.

ఆస్తిపై రుణం (P-LAP)పై వడ్డీ రేటు 9.20శాతం నుంచి 10.50 శాతం వరకు ఉంటుంది. రివర్స్ మార్ట్‌గేజ్ లోన్ (RML)పై వడ్డీ రేటు 10.55 శాతంగా ఉంది.

ఎస్బీఐ యోనో (YONO) ఇన్‌స్టా టాప్ అప్ లోన్ వడ్డీ రేటు 8.35శాతంగా ఉంటుంది. గృహ రుణ వడ్డీ రేట్లు కూడా కస్టమర్ క్రెడిట్ స్కోర్ (సిబిల్ స్కోర్) పై ఆధారపడి ఉంటాయి.

కస్టమర్లకు కలిగే ప్రయోజనాలేంటి? :
ఎస్బీఐలో గృహ రుణాలు ఇప్పుడు గతంలో కన్నా చౌకగా ఉంటాయి. మీ ఈఎంఐ భారీగా తగ్గుతుంది. కొత్త రుణం సులభంగా తీసుకోవచ్చు.

Read Also : SBI FD Rates : SBIలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? మీ వడ్డీ ఆదాయం తగ్గినట్టే.. 5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందో తెలుసా?

ఎస్బీఐ నిర్ణయంతో రుణాలు తీసుకునే కస్టమర్లకు భారీ ఉపశమనం కలిగించినప్పటికీ, FDలో పెట్టుబడి పెట్టేవారు, సీనియర్ సిటిజన్లకు వడ్డీపై ఆదాయం తగ్గనుంది.

మీరు కొత్త గృహ రుణం తీసుకోవాలనుకున్నా లేదా ప్రస్తుత రుణాన్ని ఎస్బీఐకి ట్రాన్స్ ఫ‌ర్ చేయాలనుకున్నా తక్కువ వడ్డీ ప్రయోజనాలను పొందవచ్చు.