SBI Interest Rates : SBI ఇలా షాకిచ్చిందేంటి..? ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఒకేసారి వడ్డీ రేట్లు తగ్గింపు..!
SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ప్రత్యేకించి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఒకేసారి వడ్డీ రేట్లు తగ్గించింది.

SBI Interest Rates
SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)సేవింగ్స్ బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఒకేసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ఇకపై అన్ని అకౌంట్లపై 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది.
ఇతర మెచ్యూరిటీలలో రూ.3 కోట్ల కన్నా తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా ఎస్బీఐ 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నెల 15 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.
Read Also : SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఇక రుణాలన్నీ చౌకగా..!
గత వారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక పాలసీ రేటు రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తున్నాయి.
ఈ వడ్డీ రేటు కోతలు రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించినప్పటికీ, ముఖ్యంగా వడ్డీ ఆదాయంపై ఆధారపడే డిపాజిటర్లకు మాత్రం షాకింగ్ న్యూస్..
సేవింగ్స్, ఎఫ్‌డీ రేట్లలో కొత్త మార్పులు :
ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ రేటును 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ. 10 కోట్ల కన్నా తక్కువ అకౌంట్ బ్యాలెన్స్‌లకు 2.7 శాతం, రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌లకు 3 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ఇప్పుడు వడ్డీ రేట్లను తగ్గించడంతో సంబంధిత కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా సాధారణ డిపాజిటర్లు, సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లపై ప్రభావం పడనుంది.
ఫిక్స్‌డ్ రేట్లలో మార్పులు :
211 రోజుల నుంచి ఏడాది కన్నా తక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. సాధారణ కస్టమర్లకు 6.3 శాతం నుంచి 6.05 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలానికి డిపాజిట్ రేటు 6.8 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గించింది.
ఏడాది నుంచి రెండేళ్ల మెచ్యూరిటీ డిపాజిట్లు :
సాధారణ కస్టమర్లకు వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి సవరించింది. సీనియర్ సిటిజన్లకు ఇలాంటి మెచ్యూరిటీలపై గతంలో 7 శాతం నుంచి 6.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్లు :
ఎస్బీఐ ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 6.7 శాతం నుంచి 6.45 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. అదే మెచ్యూరిటీపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటును 7.2 శాతం నుంచి 6.95 శాతానికి తగ్గించింది.
3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల కన్నా తక్కువ కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, సవరించిన రేట్లు వరుసగా 6.3 శాతం, 6.05 శాతంగా ఉన్నాయి.