SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఇక రుణాలన్నీ చౌకగా..!

SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. లోన్లపై భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇకపై రుణాలు చౌకగానే అందనున్నాయి.

SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఇక రుణాలన్నీ చౌకగా..!

SBI Interest Rates

Updated On : June 17, 2025 / 12:14 PM IST

SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు తర్వాత ఎస్బీఐ లోన్ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో ఎస్బీఐ కొత్త రుణగ్రహీతలకు పర్సనల్, హోం లోన్లు చౌకగా అందనున్నాయి.

Read Also : iPhone 16 Plus : అద్భుతమైన ఆఫర్.. చౌకైన ధరకే ఐఫోన్ 16 ప్లస్‌ కొనేసుకోండి.. ఇంత తక్కువలో మళ్లీ రాదు..!

తాజాగా వడ్డీ రేట్ల తగ్గింపుతో ఎస్బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (RLLR) 50 బేసిస్ పాయింట్లు తగ్గి 7.75 శాతానికి చేరుకుంది. ఎస్బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (EBLR)ను గతంలో 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది.

ఈ నెల 15నుంచే అమల్లోకి.. :
ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. జూన్ 15, 2025 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ అన్ని మెచ్యూరిటీలలో రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డిపాజిట్ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఎస్బీఐ కొత్త టర్మ్ డిపాజిట్ రేట్లు జూన్ 15 నుంచి అమలులోకి వస్తాయి.

ఈ కొత్త సవరణతో ఫిక్స్‌డ్ డిపాజిట్లలో 1నుంచి 2 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 6.50 శాతానికి చేరుకుంటుంది. రెండేళ్ల నుంచి 3 ఏళ్ల కన్నా తక్కువ మెచ్యూరిటీ డిపాజిట్లు 6.70 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గుతాయి.

ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఎంతంటే? :
3ఏళ్ల నుంచి 5 ఏళ్ల మెచ్యూరిటీ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా 6.30 శాతానికి చేరుకుంది. అలాగే, 5 నుంచి 10 ఏళ్లకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా 6.05 శాతానికి చేరింది. 444 రోజుల SBI అమృత్ వృష్టి వడ్డీ రేటు కూడా జూన్ 15, 2025 నుంచి అమలులోకి వచ్చింది.

దాంతో 6.85 శాతం నుంచి 6.60 శాతానికి వడ్డీ సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు కార్డ్ రేటు కన్నా అదనంగా 60 బేసిస్ పాయింట్లకు అర్హులు.

ఆర్బీఐ రెపో రేటు తర్వాత చాలా బ్యాంకులు రుణ రేటును భారీగా తగ్గించాయి. ఇప్పటికే, HDFC బ్యాంక్ రుణ రేటును తగ్గించింది. రూ. 3 కోట్ల కన్నా తక్కువ ప్రిన్సిపల్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏడాదికి గరిష్టంగా 6.6శాతం వడ్డీ రేటును అందిస్తోంది. గతంలో 6.85శాతం గరిష్ట వడ్డీ రేటు కన్నా తక్కువే.

Read Also : OnePlus Nord 4 : అద్భుతమైన డీల్.. కేవలం రూ. 25వేల లోపు ధరకే వన్‌ప్లస్ నార్డ్ 4 సొంతం చేసుకోండి..!

ప్రభుత్వ యాజమాన్యంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు యూనియన్ బ్యాంక్ తెలిపింది.