SIF Investment Funds : రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు అలర్ట్.. రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’.. సెబీ కొత్త రూల్స్!

SIF Investment Funds : ఒకవేళ షేర్ మార్కెట్ పతనం రూ.10లక్షల లోపు ఉంటే.. మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు సిఫ్ 25 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

SIF Investment Funds

SIF Investment Funds : సంపన్న పెట్టుబడిదారుల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ‘స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్’ (SIF) అనే కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు.

పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో పెట్టుబడికి కనీసం రూ.50 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. అదే సిఫ్‌లో కనీసం రూ. 10 లక్షల పెట్టుబడి పెట్టాలి. మూడు ఏళ్లకు పైగా కార్యకలాపాలు కలిగిన ఇన్వెస్టర్లకు విభిన్న పెట్టుబడులను అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా హై రిస్క్ తీసుకునే పెట్టుబడిదారుల కోసమే సెబీ ఈ ప్రత్యేక పెట్టుబడి విధానాన్ని తీసుకొచ్చింది.

Read Also : Digital Gold : డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టడం ఎలా? కలిగే లాభాలేంటి? ఫిజికల్ గోల్డ్ కన్నా ఎంతవరకు సేఫ్.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

పోర్ట్ పోలియో, సిఫ్ మధ్య అంతరాన్ని తగ్గించేలా రిస్క్ తీసుకునే పెట్టుబడిదారుల కోసం సెబీ సిఫ్ ప్రవేశపెట్టింది. అయితే, ఇందులో అన్ని సిఫ్ కేటగిరీల్లో పెట్టుబడిదారులు కనీసం రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కనీసం 3 ఏళ్ల ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. గత మూడు ఏళ్లలో సగటున రూ.10వేల కోట్ల నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM)ని నిర్వహించాలి.

అంతేకాకుండా, గత మూడు ఏళ్లలో సంబంధిత సెబీ చట్టం సెక్షన్ల కింద స్పాన్సర్ లేదా ఆస్తి నిర్వహణ సంస్థ (AMC)పై ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోకూడదని సెబీ ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా, ఒక ఎఎంసీ కనీసం పది ఏళ్ల ఫండ్ నిర్వహణ అనుభవం ఉన్న చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO)ని నియమించవచ్చు.

సగటున రూ. 5వేల కోట్ల కన్నా తక్కువ లేని AUMని పర్యవేక్షిస్తుంది. కనీసం రూ. 500 కోట్ల ఎయూఎం నిర్వహించడంలో మూడు ఏళ్ల అనుభవం ఉన్న సెకండరీ ఫండ్ మేనేజర్ కూడా ఉండాలి. పెట్టుబడిదారులు సిస్టమ్యాటిక్ ఇన్వె స్ట్మెంట్ ప్లాన్ (SIP), సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SOWP), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (NDP) టూల్స్ కూడా ఉపయోగించవచ్చు.

Read Also : Sukanya Samriddhi Yojana : ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెడితే చాలు.. మీ కూతురి పెళ్లినాటికి రూ. 69 లక్షలపైనే చేతికి అందుతాయి..!

ఒకవేళ షేర్ మార్కెట్ పతనం రూ.10లక్షల లోపు ఉంటే.. మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు సిఫ్ 25 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాండ్ 1 నుంచి బ్యాండ్ 5 వరకు మొత్తం 5 స్థాయిల్లో రిస్క్‌ను సెబీ విభజించింది.

ప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు సెబీ అనుమతితో సిఫ్ ప్రారంభించవచ్చు. దీనికి కొన్ని అర్హత ప్రమాణాలను పాటించాలి. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. రూ.10వేల కోట్ల నిర్వహణ ఆస్తులు ఉన్న సంస్థలు అప్లయ్ చేసుకోవచ్చు.