SEBI Mutual Funds : పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. ఇక ఒక్కో కేటగిరీకి 2 మ్యూచువల్ ఫండ్లు..? సెబీ ప్రతిపాదనతో ప్రభావం ఉంటుందా?

SEBI Mutual Funds : మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్ (MF) పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

SEBI Mutual Funds

SEBI Mutual Funds :  పెట్టుబడిదారులకు షాకింగ్ న్యూస్.. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారా? తాజాగా మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) కొత్త ప్రతిపాదన (SEBI Mutual Funds) తెరపైకి తీసుకొచ్చింది. రూ. 46 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అతిపెద్ద మార్పు రాబోతుంది. ఒకవేళ సెబీ ప్రతిపాదన అమలులోకి వస్తే ఏమౌతుంది? మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడం, అందులో పెట్టుబడి పెట్టే విధానాన్ని మార్చేస్తారా? అంటే అదే జరగబోతుంది.

సెబీ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు అదే కేటగిరీలో రెండవ పథకాన్ని ప్రారంభించేందుకు అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది. ఇప్పటివరకూ ఇలాంటి విధానానికి అనుమతి లేదు. సెబీ ప్రతిపాదనతో అతి త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అదేగానీ జరిగితే.. పెట్టుబడులపై ఎంతవరకు ప్రభావం ఉంటుంది? అనేది పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.

ఇటీవలే సెబీ మ్యూచువల్ ఫండ్ (MF) పథకాల కేటగిరీలను సమీక్షించాలని ప్రతిపాదించింది. ఈ పథకాలలో స్పష్టత తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగా పోర్ట్‌ఫోలియోలో ‘ఓవర్‌లాప్’ నివారించాలని యోచిస్తోంది.

సాధారణంగా పెట్టుబడిదారులు ఎవరైనా వేర్వేరు మ్యూచువల్ ఫండ్‌లు లేదా పథకాలలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆయా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో ఓవర్‌లాప్ జరుగుతుంది. కానీ, ఆ ఫండ్లలో ఎక్కువ పెట్టుబడులు ఒకే కంపెనీలు లేదా సెక్టార్లలో ఉంటాయి. ఈ విధానంతో పెట్టుబడులపై రిస్క్ పెరుగుతుంది.

Read Also : OnePlus 13s Price : సూపర్ డిస్కౌంట్ గురూ.. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్‌పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు.. ఈ డీల్ మీకోసమే..!

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రతి AMC ఒక కేటగిరీకి ఒక పథకాన్ని మాత్రమే కలిగి ఉండాలి. అది లార్జ్-క్యాప్ ఫండ్ లేదా మిడ్-క్యాప్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఏదైనా ఒకే ఉండాలి. కానీ ఇప్పుడు, సెబీ ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలనుకుంటోంది.

ఇలా ఉంటేనే రెండో పథకం :

  • ప్రస్తుత పథకం 5 ఏళ్లు కన్నా పాతదై ఉండాలి.
  • నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) రూ. 50వేల కోట్లను మించాలి.
  • ప్రస్తుతం రూ. లక్ష కోట్లకు పైగా ఉండే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ వంటి భారీ మొత్తంలో ఫండ్స్ మాత్రమే అర్హత ఉంటుంది.

కొత్త పథకం ప్రారంభమైతే ఏమౌతుంది? :

  • ఒరిజినల్ పథకం కొత్త సింగిల్ టైమ్ పెట్టుబడులను అంగీకరించదు. అంటే.. ఇప్పటికే ఉన్న SIP పెట్టుబడులకు ఇబ్బంది ఉండదు.
  • సపరేట్ స్కీమ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ జారీ అవుతుంది.
  • కొత్త పథకంలో పెట్టుబడి లక్ష్యం, ఆస్తి కేటాయింపు, వ్యూహం రెండూ ఉండాలి.
  • కొత్త పథకంలో TER (మొత్తం ఖర్చు నిష్పత్తి) అసలు మొత్తాన్ని మించకూడదు.
  • రెండు పథకాలకు స్పష్టంగా వేర్వేరు పేర్లు ఉండాలి.. (మిడ్ క్యాప్ ఫండ్ సిరీస్ 1, మిడ్ క్యాప్ ఫండ్ సిరీస్ 2)

సెబీ ప్రతిపాదనకు కారణామేంటి? :
కొన్ని మ్యూచువల్ ఫండ్ల పథకాలు పెద్ద మొత్తంలో ఉన్నాయనే ఆందోళనలపై సెబీ స్పందించింది. భారీ ఫండ్ కారణంగా రాబడి తగ్గుతుంది. సెబీ ప్రతిపాదిత నియమంతో మరో సమస్య లేకపోలేదు. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొత్త సమస్యలకు దారితీయొచ్చు.

క్రెడెన్స్ వెల్త్ వ్యవస్థాపకుడు కీర్తన్ ఎషా ప్రకారం.. ఫస్ట్ ఫండ్‌లో పెట్టుబడిదారుడు మొత్తం విత్ డ్రా చేసుకుంటారు. ఫండ్ రిడెంప్షన్‌లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇన్‌ఫ్లోలు ఉండవు. ఫలితంగా అసలైన పాత ఫండ్ పై ప్రభావం పడుతుందని అన్నారు. ఒకవేళ, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కొత్త పథకానికి మారితే.. పాత ఫండ్ పెట్టుబడుల ప్రయోజనాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

ఫండ్ హౌస్‌లకు ఎక్కువమొత్తంలో పథకాలు? :
అది సాధ్యపడదనే చెప్పాలి. ఎందుకంటే.. ఏ సమయంలోనైనా కేటగిరీకి రెండు పథకాలు మాత్రమే అనుమతిస్తామని సెబీ చెబుతోంది. అయితే, ఒకటి స్థాయి లేదా ప్రయోజనం కోల్పోతే.. ఆయా ఫండ్ హౌస్‌లు రెండింటినీ విలీనం చేయవచ్చు.

పెట్టుబడిదారులు గమనించాల్సిన విషయాలివే :

  • మీ ఫండ్ పెద్ద మొత్తంలో ఉండి 5 ఏళ్ల కన్నా పాతది అయితే ప్రభావితం కావచ్చు.
  • కొత్త పథకం లాంచ్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ పరిమితంగా ఉంటుంది.
  • రిడెంప్షన్లు పెరిగితే పాత పథకాల్లో అస్థిరత కనిపించవచ్చు.