Shiv Nadar Top : దాతృత్వంలో మరోసారి శివనాడార్ టాప్.. టాప్ 10 జాబితాలో ఎవరెవరంటే?

Shiv Nadar Top : ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2024లో టాప్ 10 భారతీయ దాతల జాబితా విడుదల చేసింది. శివ్‌నాడార్ అగ్రస్థానంలో నిలవగా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

Shiv Nadar tops EdelGive-Hurun India’s philanthropy list

EdelGive-Hurun India’s philanthropy list : ప్రతి ఏడాదిలో భారత అగ్రశ్రేణి దాతల జాబితా విడుదల చేస్తారు. ప్రతి ఏడాది మాదిరిగానే 2024 ఏడాది కూడా ఎడెల్ గివ్-హురున్ 203 మంది పేర్లతో కూడిన టాప్ 10 దాతృత్వ జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటిసారిగా 96 మంది పేర్లను చేర్చింది. ఈ జాబితా ప్రకారం.. భారత్ అగ్రశ్రేణి 203 మంది వ్యాపారవేత్తలు మొత్తంగా రూ. 8,783 కోట్లు విరాళంగా ఇచ్చారు. రెండేళ్ల క్రితం కన్నా ఇది 55శాతం ఎక్కువ. అయితే, భారత టాప్ 10 దాతలెవరు? ఎవరు ఎంత విరాళంగా ఇచ్చారు అనేది వివరంగా తెలుసుకుందాం.

ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2024లో టాప్ 10 భారతీయ దాతల జాబితా విడుదల చేసింది. శివ్‌నాడార్ అగ్రస్థానంలో నిలవగా, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. రూ. 2,153 కోట్లతో శివ్ నాడార్, ఆయన కుటుంబం ఐదేళ్లలో మూడోసారి ఎడెల్ గివ్-హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2024లో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ ఏడాదిలో సమిష్టిగా రూ. 4,625 కోట్లు అందించిన టాప్ 10 దాతృత్వవేత్తలలో ముఖేష్ అంబానీ కుటుంబం, బజాజ్ కుటుంబం, కుమార్ మంగళం ఆయన కుటుంబం, గౌతమ్ అదానీ కుటుంబం వంటి పేర్లను కూడా జాబితా గుర్తించింది. హురూన్ ఇండియా జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలవగా, బజాజ్ కుటుంబం 3వ స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ ఏడాదిలో రూ. 407 కోట్లు విరాళంగా అందించింది. బజాజ్ గ్రూప్ ట్రస్ట్ రూ. 352 కోట్లు విరాళంగా అందించింది.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబం ఈ ఏడాదిలో గరిష్ట విరాళాన్ని అందించారు. శివ నాడార్ ఈ టైటిల్‌ను మూడోసారి అందుకున్నారు. ఆయన విరాళాల సగటును లెక్కగడితే.. ఆయన ప్రతిరోజూ రూ.5.9 కోట్లు విరాళంగా ఇచ్చారు. అత్యధికంగా విరాళం ఇచ్చిన మహిళ ఎవరంటే.. రూ. 154 కోట్లు విరాళంగా ఇచ్చిన 65 ఏళ్ల రోహిణి నీలేకనికి చెందుతుంది.

హురున్ పరిశోధన ప్రకారం.. భారత్‌లో ఇప్పుడు 18 మంది వ్యాపారవేత్తలు సంవత్సరానికి రూ. 100 కోట్ల కన్నా ఎక్కువ విరాళాలు ఇచ్చారు (2019 నుంచి 10 మంది వ్యక్తులు), 30 మంది వ్యక్తులు రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు (2019 నుంచి 125శాతం ఎక్కువ). 61 మంది రూ. 20 కోట్ల కన్నా ఎక్కువ విరాళాలు ఇచ్చారు (2019 కన్నా 128శాతం ఎక్కువ). విరాళం ఇచ్చిన అతి పిన్న వయస్కుడు జీరోధాకు చెందిన నిఖిల్ కామత్ ఉన్నారు.

టాప్ 10 దాతలు ఎవరు? :
శివ నాడార్, ఆయన కుటుంబం : రూ. 2,153 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్య, కళ-సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఈ విరాళాన్ని అందించారు.

ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం : రూ. 407 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాలలో ఎక్కువ భాగం గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, క్రీడల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, సాంస్కృతిక పరిరక్షణలో పెట్టుబడి పెట్టారు.

బజాజ్ కుటుంబం : రూ. 352 కోట్లు విరాళంగా ఇచ్చింది. గత ఏడాది కన్నా 33శాతం ఎక్కువ. గ్రామీణ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిపై వెచ్చించారు.

కుమార్ మంగళం బిర్లా కుటుంబం : రూ. 334 కోట్లు విరాళంగా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, క్రీడలలో విరాళాలు ఇస్తుంది.

గౌతమ్ అదానీ కుటుంబం : రూ. 330 కోట్లు విరాళంగా ఇచ్చారు. అదానీ ఫౌండేషన్ ద్వారా విద్య, నైపుణ్యాభివృద్ధికి ఈ విరాళం అందించారు.

నందన్ నీలేకని : రూ. 307 కోట్లు విరాళంగా ఇచ్చారు. సతీమణి రోహిణి నీలేకనితో కలిసి సమాజంలో మంచి మార్పు కోసం ఆయన శ్రీకారం చుట్టారు.

కృష్ణ శివుకుల : ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్లు విరాళంగా ఇచ్చారు. అనేక పరిశోధన ప్రాజెక్టులకు సహకరం అందించారు.

అనిల్ అగర్వాల్ కుటుంబం : రూ. 181 కోట్లను విరాళంగా అందించారు. అనేక సామాజిక-ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు.

సుస్మిత, సుబ్రొతో బాగ్చీ : రూ. 179 కోట్లు విరాళంగా అందించారు. అహ్మదాబాద్ యూనివర్శిటీలో బాగ్చి స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ను స్థాపించారు.

విద్య సామాజిక సేవా రంగంలో పనిచేస్తున్న రోహిణి నీలేకని రూ. 154 కోట్లు విరాళంగా అందించారు.

Read Also : iPhone Charge Feature : ఐఫోన్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఫీచర్.. ఈ కొత్త ఐఓఎస్‌ 18తో ఛార్జింగ్ స్టేటస్ చూడొచ్చు!