Hyundai Six Airbags : హ్యుందాయ్ అన్ని మోడల్స్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. ఇక మీ ప్రయాణం మరింత భద్రం..!
6 Airbags Hyundai Vehicles : హ్యుందాయ్ ఇండియా గ్రాండ్ i10 నియోస్, i20, i20 ఎన్-లైన్, ఆరా, ఎక్స్‌టర్, వెన్యూ, వెన్యూ ఎన్-లైన్, వెర్నా, క్రెటా, అల్కాజార్, టక్సన్, కోనా ఎలక్ట్రిక్,ఐయోనిక్ 5 వంటి 13 మోడళ్లను విక్రయిస్తోంది.

Six airbags now made standard in all Hyundai vehicles
Six Airbags Hyundai Vehicles : ప్రముఖ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందజేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా దేశంలో ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఒరిజినల్ డివైజ్ తయారీదారు (OEM)గా అవతరించింది.
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం భారతీయ విభాగంలో Grand i10 Nios, i20, i20 N-Line, Aura, Exter, Venue, Venue N-Line, Verna, Creta, Alcazar, Tucson, Kona Electric, Ioniq 5 వంటి 13 మోడళ్లను అందిస్తుంది. హ్యుందాయ్ వద్ద ‘Saftey For All’ అనేది అత్యంత ప్రాధాన్యత, వాహన భద్రతా ఫీచర్ల అథెంటికేషన్ బెంచ్‌మార్క్ క్రియేటర్లుగా ఉన్నాం.
అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ :
ఇప్పుడు, అన్ని మోడల్‌లు, అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల అథెంటికేషన్ ప్రకటించినందుకు సంతోషిస్తున్నాం’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ కిమ్ అన్సూ చెప్పారు. కేవలం స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ మాత్రమే కాదు, సురక్షితమైన మొబిలిటీ సొల్యూషన్స్, వాహన భద్రతా ప్రమాణాలను పెంచే ప్రయత్నాలను కొనసాగిస్తుందని అన్నారు. తద్వారా భారతీయ రహదారులను అందరికీ సురక్షితమైనదిగా మారుస్తుందని అన్నారాయన.

Six airbags now made standard in all Hyundai vehicles
సెప్టెంబర్‌లో రికార్డు సేల్స్ విక్రయాలు :
హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు, ఎగుమతులు రెండింటినీ కలిపి సెప్టెంబరులో రికార్డు సేల్స్ మొత్తం 71,641 యూనిట్లు విక్రయించింది. దాంతో అత్యధిక నెలవారీ వాల్యూమ్‌ను నివేదించింది. గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 63,201 యూనిట్ల నుంచి 13.35శాతం పెరుగుదలను గుర్తించింది. దేశీయ మార్కెట్‌లో కంపెనీ పనితీరుతో విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్‌లో 54,241 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుందాయ్ 49,700 యూనిట్లను విక్రయించిన క్రితం ఏడాదితో పోలిస్తే.. 9.13శాతం వృద్ధిని సూచిస్తుంది.
హ్యుందాయ్ SUV మోడళ్ల శ్రేణికి భారతీయ వినియోగదారుల నుంచి ఆదరణ పొందడం వల్ల దేశీయ అమ్మకాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు. బలమైన దేశీయ అమ్మకాలతో పాటు, హ్యుందాయ్ ఎగుమతి గణాంకాలలో కూడా గణనీయమైన పెరుగుదలను చూసింది. సెప్టెంబరులో, కంపెనీ 17,400 యూనిట్లను ఎగుమతి చేసింది. ఏడాదికి 28.87శాతం వృద్ధిని సూచిస్తుంది. కంపెనీ 13,501 యూనిట్లను ఎగుమతి చేసిన గతేడాదితో పోలిస్తే గణనీయమైన మెరుగుదలగా చెప్పవచ్చు.