Small Savings Schemes : చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం.. ఈ స్కీమ్ లో ఎక్కువ వడ్డీ… డోంట్ మిస్

Small Savings Schemes : భారత ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి PPF, NSC వడ్డీ రేట్లను మార్చలేదు.

Small Savings Schemes

Small Savings Schemes : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. చిన్నపాటి సేవింగ్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. PPF, NSCతో సహా ఇతర చిన్న సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగనున్నాయి. జూలై 1, 2025 నుంచి వరుసగా 6వ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు (Small Savings Schemes) చేయలేదు. ఈ మేరకు నివేదిక పేర్కొంది.

జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి వివిధ చిన్న సేవింగ్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లు, ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఎలాంటి మార్పులు ఉండవు” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండవ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగా ఉంచినట్లు అధికారిక ప్రభుత్వ నోటిఫికేషన్‌ పేర్కొంది.

1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): PPF సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు 7.1 శాతం వద్ద అలానే ఉంది.

2. సుకన్య సమృద్ధి పథకం : సుకన్య సమృద్ధి పథకంలో 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

3. మూడేళ్ల టర్మ్ డిపాజిట్ స్కీమ్ : 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు కూడా ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే 7.1 శాతం వద్ద ఉంది.

3. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ : 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాబోయే రెండో త్రైమాసికానికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లు 4 శాతం వద్దనే ఉన్నాయి.

Read Also : WhatsApp iPhone : వాట్సాప్‌లో మల్టీ-అకౌంట్ ఫీచర్.. ఇకపై ఒకే ఐఫోన్‌లో 2 అకౌంట్లు వాడొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

4. కిసాన్ వికాస్ పత్ర : కిసాన్ వికాస్ పత్ర సేవింగ్స్ స్కీమ్ కింద 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఎందుకంటే.. పెట్టుబడులు 115 నెలలు లేదా 9.7 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ పొందవచ్చు.

5. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) : 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంపై వడ్డీ రేటు కూడా 7.7 శాతంగా ఉంటుంది.

6. నెలవారీ ఆదాయ పథకం (MIS) : ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా నెలవారీ ఆదాయ పథకం (MIS) రెండో త్రైమాసికంలో పెట్టుబడిదారులకు 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ప్రధానంగా చిన్న సేవింగ్స్ స్కీమ్స్ అనేవి పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంటాయి. భారత ప్రభుత్వం చివరిసారిగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు) కొన్ని పథకాల వడ్డీ రేటులో మార్పులు చేసింది. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటుపై ఈ డేటా ప్రతి త్రైమాసికంలో విడుదల అవుతుంది.