WhatsApp iPhone : వాట్సాప్‌లో మల్టీ-అకౌంట్ ఫీచర్.. ఇకపై ఒకే ఐఫోన్‌లో 2 అకౌంట్లు వాడొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?
WhatsApp iPhone : వాట్సాప్‌లో మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది. ఇకపై ఐఫోన్ యూజర్లు ఒకే డివైజ్‌లో 2 వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు..

WhatsApp iPhone
WhatsApp iPhone : ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ కొత్త iOS బీటా వెర్షన్ 25.19.10.74లో మల్టీ-అకౌంట్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు (WhatsApp iPhone) ఒకే ఐఫోన్‌లో పర్సనల్, బిజినెస్ అకౌంట్లను సులభంగా యాక్సస్ చేయొచ్చు.
వాట్సాప్ ఇప్పుడు iOS యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఒకే ఐఫోన్‌లో మల్టీ వాట్సాప్ అకౌంట్లను యాక్సస్ చేయొచ్చు. గతంలో ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ iOS యూజర్ల కోసం కూడా అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
కొత్త ఫీచర్ ఏంటి? :
WABetaInfo రిపోర్టు ప్రకారం.. వాట్సాప్ కొత్త iOS బీటా వెర్షన్ 25.19.10.74లో మల్టీ-అకౌంట్ ఫీచర్ కనిపించింది. ఈ ఫీచర్ తర్వాత వినియోగదారులు ఒకే డివైజ్‌లో పర్సనల్, బిజినెస్ అకౌంట్లలో సులభంగా రన్ చేయొచ్చు.
ఎలా పనిచేస్తుందంటే? (WhatsApp iPhone) :
- వాట్సాప్ సెట్టింగ్స్‌లో “Account List” అనే కొత్త సెక్షన్ ఉంటుంది.
- వినియోగదారులు తమ సైన్ ఇన్ (Sign-in) చేసిన అన్ని అకౌంట్లను చెక్ చేయొచ్చు.
- ప్రతి అకౌంట్ ప్రొఫైల్ ఫొటో, స్టేటస్ ద్వారా గుర్తించడం సులభం
- వినియోగదారులు లాగ్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు.
- యాప్‌ను రీస్టోర్ చేయాల్సిన అవసరం లేదు.
- సింగిల్ ట్యాప్‌లో అకౌంట్ల మధ్య మారవచ్చు.
- ప్రతి అకౌంట్ సొంత స్పెషల్ చాట్ హిస్టరీ, సెట్టింగ్స్, నోటిఫికేషన్ టోన్‌లు, ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్స్, బ్యాకప్ వంటివి యాక్సస్ చేయొచ్చు.
నోటిఫికేషన్లు ఎలా :
మీరు ప్రైమరీ అకౌంటులో ఉండి.. సెకండరీ అకౌంట్‌కు మెసేజ్ వస్తే.. నోటిఫికేషన్ పంపినవారి పేరు, అకౌంట్ పేరు రెండింటినీ చూపుతుంది. మీరు ఆ నోటిఫికేషన్‌పై ట్యాప్ చేసిన వెంటనే, వాట్సాప్ ఆటోమాటిక్‌గా సెకండరీ అకౌంటుకు మారి నేరుగా ఆ చాట్‌కు వెళ్తుంది.
అందుబాటులోకి ఎప్పుడంటే? :
ప్రస్తుతం, ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఆపిల్ టెస్ట్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ బీటా టెస్టర్లకు కూడా అందుబాటులో లేదు. రాబోయే నెలల్లో పబ్లిక్ బీటాకు, స్టేబుల్ వెర్షన్‌కు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.