Upcoming Smartphones : కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. నథింగ్, వన్ ప్లస్, శాంసంగ్ సహా జూలైలో రిలీజ్ అయ్యే ఫోన్ల ఫుల్ లిస్ట్..
Upcoming Smartphones : జూలై 2025లో కొత్త మోడల్ ఫోన్లు నథింగ్, శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్ ఫోన్ నుంచి రాబోతున్నాయి.

Upcoming Smartphones
Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ జూలైలో భారత మార్కెట్లోకి నెక్స్ట్-జెన్ ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ మోడళ్లు రాబోతున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు (Upcoming Smartphones) కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త నథింగ్ ఫోన్ 3 నుంచి శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లు అతి త్వరలో లాంచ్ కానున్నాయి.. ఏయే ఫోన్లలో ఎలాంటి స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఉండొచ్చు అనేది ఓసారి వివరంగా తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ 3 :
నథింగ్ ఫోన్ 3 అప్‌గ్రేడ్ మోడల్ రాబోతుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్, “గ్లిఫ్ మ్యాట్రిక్స్” ఎల్ఈడీ లేఅవుట్‌తో లేటెస్ట్ డిజైన్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ కోసం 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా ఉండనుంది.
స్పెషిఫికేషన్లు (అంచనా) :
6.77-అంగుళాల LTPO AMOLED, 120Hz
స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 4
ట్రిపుల్ రియర్ (50MP ప్రైమరీ + టెలిఫోటో), 32MP ఫ్రంట్
5,150mAh, 65W వైర్డు, 20W వైర్‌లెస్ సపోర్టు
ఒప్పో రెనో 14 సిరీస్ :
జూలై 3న ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ కానుంది. ఒప్పో వరుసగా డైమెన్సిటీ 8450, 8350 ఆధారిత రెనో 14 ప్రో, రెనో 14 మోడల్స్ లాంచ్ చేస్తుంది. ఈ రెండు ఫోన్లలో ఏఐ మెరుగైన ఫోటోగ్రఫీ టూల్స్, హై-రిఫ్రెష్ OLED డిస్‌ప్లే కలిగి ఉంటాయి.
స్పెషిఫికేషన్లు :
6.83-అంగుళాల OLED, 1.5K రిజల్యూషన్
16GB ర్యామ్, 1TB స్టోరేజీ
ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరాలు, 50MP సెల్ఫీ కెమెరాలు
6,200mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్టు
వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ :
వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ జూలై 8న లాంచ్ కానుంది. వన్‌ప్లస్ ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ నార్డ్ 5, నార్డ్ CE 5 మోడల్స్ రిలీజ్ చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్ 5 స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ద్వారా పవర్ పొందగా, నార్డ్ CE 5 డైమెన్సిటీ 8350తో రన్ అవుతుంది.
స్పెషిఫికేషన్లు :
6.74-అంగుళాల OLED, 1.5K రిజల్యూషన్
50MP డ్యూయల్ కెమెరా
7,000mAh బ్యాటరీతో సపోర్టు
100W ఫాస్ట్ ఛార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డబుల్ ఫోన్లు :
జూలై 9న జరగబోయే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025లో శాంసంగ్ Z ఫోల్డ్ 7, Z ఫ్లిప్ 7 సహా కొత్త Z ఫోల్డ్ అల్ట్రా, FE ఫ్లిప్‌లను ఆవిష్కరించనుంది. రాబోయే ఈ మడతబెట్టే ఫోన్లు చాలా సన్నగా, తేలికగా ఉంటాయి. శాంసంగ్ ట్రై-ఫోల్డ్ ప్రోటోటైప్ కూడా చేయవచ్చు.
వివో X200 FE ఫోన్ :
వివో X-సిరీస్‌లో వివో X200 FE ఫస్ట్ ‘ఫ్యాన్ ఎడిషన్’ కానుంది. డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, Zeiss, 4K ఫ్రంట్ వీడియో రికార్డింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
స్పెషిఫికేషన్లు (అంచనా) :
6.31 అంగుళాల అమోల్డ్, 120Hz
50MP + 50MP + 8MP బ్యాక్ కెమెరా సెటప్
90W ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీతో సపోర్టు
రియల్‌మి 15 సిరీస్ :
రియల్‌మి 15 సిరీస్ ఈ నెలలో ప్రారంభం కానుంది. కచ్చితమైన తేదీ వెల్లడి కాలేదు. రియల్‌మి 15, 15 ప్రో త్వరలో లాంచ్ కానున్నాయని కంపెనీ ధృవీకరించింది. ఫీచర్ల వివరాలను ఇంకా రివీల్ చేయలేదు.