Smartphone Tips : వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. ఈ 10 టిప్స్ తప్పక తెలుసుకోండి..!

Smartphone Tips : వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్‌ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళ వర్షంలో తడిస్తే ఫోన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Smartphone Tips : వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున కూడా ఇలా చేయొద్దు.. ఈ 10 టిప్స్ తప్పక తెలుసుకోండి..!

Smartphone Tips

Updated On : July 1, 2025 / 3:37 PM IST

Smartphone Tips : అసలే వర్షాకాలం.. స్మార్ట్‌ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వర్షంలో తడిసినప్పుడు ఫోన్ పనిచేయదు. మీ తడి చేతులతో (Smartphone Tips) స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడూ ఉపయోగించరాదు. కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు.

వర్షం కురుస్తున్నప్పుడు మీ హ్యాండ్‌సెట్‌లను వాడేందుకు కొన్ని స్మార్ట్ టిప్స్ తప్పక పాటించాలి. మీ హ్యాండ్‌సెట్‌ను వర్షంలో తడవకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ 10 విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ ఫోన్ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. వాటర్ ప్రూఫ్ పర్సు లేదా జిప్ లాక్ వాడండి :
వర్షం నుంచి మీ హ్యాండ్‌సెట్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంచి నాణ్యత గల వాటర్‌ప్రూఫ్ మొబైల్ పౌచ్‌ తీసుకోండి. కనీసం కొన్ని జిప్‌లాక్ బ్యాగులను తీసుకెళ్లండి. ప్రయాణాల సమయంలో మీ ఫోన్ వర్షంలో తడవకుండా జాగ్రత్త పడొచ్చు.

2. తడి చేతులతో ఫోన్ ఛార్జింగ్ చేయొద్దు :
నీరు, విద్యుత్ రెండూ ప్రాణాంతకమే. మీ చేతులు లేదా ఛార్జింగ్ పోర్ట్ తడిగా ఉంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జర్‌లోకి ప్లగ్ చేయవద్దు. షార్ట్ సర్క్యూట్‌లకు దారితీయొచ్చు. మీకు విద్యుత్ షాక్ కూడా రావచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చు.

Read Also : HONOR Magic V5 : మడతబెట్టే ఫోన్ కావాలా? హానర్ వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. ట్రిపుల్ కెమెరా సెటప్ ఫీచర్లు కేక!

3. బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేయండి :
తేమ వాతావరణం అనేది మీ హ్యాండ్‌సెట్ బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీని పెంచుతుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బ్యాటరీని సేవ్ చేయడానికి వారి డివైజ్‌లలో బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఎనేబుల్ చేయాలి. ముఖ్యంగా ప్రయాణాలు లేదా అత్యవసర సమయాల్లో పవర్ సేవ్ చేసుకోవచ్చు.

4. ఫోన్ తడిగా ఉంటే ఇలా ఆఫ్ చేయండి :
మీ ఫోన్ వర్షంలో తడిస్తే.. వెంటనే ఆఫ్ చేయండి. హెయిర్ డ్రయ్యర్‌ వాడొద్దు. చాలా మంది యూజర్లు డివైజ్ ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్‌ను వాడుతుంటారు. ఇలా ఎప్పుడూ చేయొద్దు.. ముందుగా ఏదైనా పొడి గుడ్డతో తుడవండి. బియ్యం లేదా సిలికా జెల్ ప్యాకెట్లలో 24 గంటల నుంచి 48 గంటల పాటు ఫోన్ అలానే ఉంచండి.

5. సేఫ్టీ కోసం క్లౌడ్ బ్యాకప్‌ ఎనేబుల్ చేయండి :
వర్షాకాలం తరచుగా ఫోన్ ఫెయిల్ అవుతుంది. డేటా కోల్పోకుండా ఉండేందుకు.. మీ కాంటాక్ట్‌లు, ఫొటోలు, వాట్సాప్ చాట్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్‌లను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ చేయండి. స్టోరేజీ పెంచుకోవడానికి మీ మొబైల్ డేటాను మీ ల్యాప్‌టాప్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉండాలి.

6. యాంటీ-మాయిశ్చర్ హ్యాక్‌లను వాడండి :
మీ ఫోన్‌ను సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్న బ్యాగ్‌లో ఉంచండి లేదా ఇంటర్నల్‌గా తేమను పీల్చుకోవడానికి కేస్ లోపల బ్లాటింగ్ పేపర్‌తో స్టోర్ చేయండి.

7. స్ట్రాంగ్ లేదా వాటర్ ప్రూఫ్ కేసు వాడండి :
మీరు తరచుగా ట్రావెల్ చేసేవారు అయినా లేదా టూవీలర్ నడుపుతుంటే.. వాటర్, షాక్ నుంచి ప్రొటెక్షన్ కోసం మిలిటరీ-గ్రేడ్ లేదా IP68-రేటెడ్ ఫోన్ కేసు తీసుకోవాలి.

8. ఛార్జింగ్ పోర్టు క్లీన్ చేయండి :
ఈ స్మార్ట్‌ఫోన్ లోపల వర్షాకాలంలోనే కాకుండా, ఇతర సీజన్లలో కూడా దుమ్ము, తేమ చేరుతుంది. ఫోన్ USB-C లేదా లైటనింగ్ పోర్ట్‌ను మూసుకుపోయేలా చేస్తుంది. కొన్ని రోజులకు ఒకసారి అయినా పోర్ట్‌ను సున్నితంగా క్లీన్ చేయండి. మృదువైన బ్రష్ లేదా బ్లోవర్‌ను వాడండి.

9. వర్షంలో ఫోన్ మాట్లాడొద్దు :
వర్షపు నీరు ఇయర్‌పీస్ లేదా మైక్‌లోకి వస్తే.. వాటర్ ప్రూఫ్ ఫోన్ కూడా ఫెయిల్ అవుతుంది. ఫోన్ కాల్స్ కోసం వైర్డు ఇయర్‌ఫోన్‌లు లేదా బ్లూటూత్ బడ్‌లను ఉపయోగించండి.

10. ఫోన్ టెంపరేచర్ మానిటర్ చేయండి :
మీ ఫోన్ వేడెక్కడానికి తేమ కూడా ప్రధాన కారణం. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు లేదా ఉపయోగిస్తున్నప్పుడు మీ హ్యాండ్‌సెట్ అసాధారణంగా వేడిగా అనిపిస్తే వెంటనే అన్‌ప్లగ్ చేయండి.