Sovereign Gold Bond scheme opens for subscription. Check price and other details
Sovereign Gold Bond scheme : గోల్డ్ బాండ్లను కొనేవారికి గుడ్‌న్యూస్.. ప్రస్తుతం ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ గోల్డ్‌కు ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోవరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ (III) కొత్త సిరీస్ ప్రవేశపెట్టింది. ఈ మూడో సిరీస్ విక్రయంలో భాగంగా బంగారం కొనుగోలుదారుల కోసం గోల్డ్ బాండ్లను తగ్గింపు ధరకే అందిస్తోంది ఆర్బీఐ. డిసెంబర్ 18 నుంచి ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులను అనుమతిస్తోంది.
గ్రాము బంగారంపై రూ. 50 తగ్గింపు.. :
అయితే, ఆసక్తిగల పెట్టుబడిదారులు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేల్ మొత్తం 5 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే.. డిసెంబర్ 22న (శుక్రవారం) ఈ సేల్ ముగియనుంది. గోల్డ్ బాండ్ గ్రాము అసలు ధర రూ.6,199గా ఆర్బీఐ నిర్ణయించగా.. దీనిపై రూ. 50 తగ్గింపు ధరకే అందిస్తోంది. దాంతో గ్రాము ధర రూ.6,149కే పొందవచ్చు.
Read Also : Gold demand: 2024లో భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్.. 5 కారణాలు చెప్పిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్
ఈ స్కీమ్ నో రిస్క్.. ఫుల్ సేఫ్ :
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. బంగారంలో పెట్టుబడి పెట్టే స్కీమ్.. ఫిజికల్ గోల్డ్ కాకుండా బంగారంపై పెట్టుబడి వారి కోసం ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడిపై వచ్చే రాబడి అసలు గోల్డ్ ధర మాదిరిగానే ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ బదులుగా డిజిటల్ రూపంలో ఉంటుంది.. అందుకే ఇది చాలా సేఫ్.. కొనుగోలు చేసిన గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే, మీకు దగ్గరలోని బ్యాంకులోనూ దరఖాస్తు చేయడం ద్వారా పొందవచ్చు.
Sovereign Gold Bond scheme
గరిష్టంగా 500 గ్రామలు వరకు కొనొచ్చు :
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేవారు అయితే.. ఆర్బీఐ వెబ్‌సైట్ లేదా ఏదైనా బ్యాంకు ద్వారా అయినా కొనుగోలు చేయొచ్చు. ఎస్‌జీబీ పేమెంట్ గరిష్టంగా రూ. 20వేల వరకు అనుమతిస్తుంది. అందుకు, క్యాష్ పేమెంట్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. సాధారణ బంగారం కొనుగోలుదారులకు గరిష్ఠంగా 500 గ్రాముల వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అదే కొన్ని సంస్థలకు అయితే గరిష్ఠంగా 20 కేజీల వరకు కొనేందుకు అవకాశం కల్పిస్తోంది.
బాండ్ల కాల పరిమితి 8ఏళ్లు :
ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ ఎస్‌జీబీ 2023-24 రెండు తాజా సంచికలను ప్రకటించింది. అందులో ఒకటి డిసెంబర్‌లో కొనసాగుతోంది. మరొకటి ఫిబ్రవరిలో 12 నుంచి 16 మధ్య ప్రారంభం కానుంది. ఈ గోల్డ్ బాండ్ల విక్రయానికి నివాసితులు, హెచ్‌యూఎఫ్, ట్రస్ట్‌లు, యూనివర్శిటీలు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే ఆర్బీఐ పరిమితం చేసింది. ఈ బాండ్‌ల కాలపరిమితి 8 ఏళ్ల పాటు ఉంటుంది. 5వ సంవత్సరం తర్వాత ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఆ తేదీనే వడ్డీని చెల్లించాలి. కనీస పెట్టుబడికి ఒక గ్రాము బంగారం అనుమతి ఉంటుంది.
ఏడాదికి 2.5 శాతం వడ్డీ :
గోల్డ్ బాండ్లపై ఏడాదికి 2.5 శాతం వడ్డీని ఆర్బీఐ అందిస్తోంది. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) సాధారణ వ్యక్తులకు గరిష్టంగా 4 కిలోలు, హెచ్‌యూఎఫ్ కోసం 4 కిలోలు, ట్రస్టులు, సారూప్య సంస్థలకు 20కిలోల కొనేందుకు అవకాశం ఉంటుంది. జాయింట్ హోల్డింగ్ విషయంలో 4 కిలోల పెట్టుబడి పరిమితి మొదటి దరఖాస్తుదారుకు మాత్రమే వర్తిస్తుంది.
ఫిజికల్ గోల్డ్ డిమాండ్‌ను తగ్గించడానికి బంగారం కొనుగోలుకు ఉపయోగించే దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపుగా మార్చడానికి (SGB) స్కీమ్ 2015 నవంబర్‌లో ప్రారంభమైంది. గత సెప్టెంబరు 2023లో రెండో సిరీస్ విక్రయాలు జరగగా, గత ఫిబ్రవరిలో ఫస్ట్ సిరీస్ విక్రయాలు జరిగాయి.
Read Also : Benefits of Investing in Gold: 2024లో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే..