Gold demand: 2024లో భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్.. 5 కారణాలు చెప్పిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

బంగారాన్ని కొనాలని అనుకునేవారికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించింది.

Gold demand: 2024లో భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్.. 5 కారణాలు చెప్పిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్

gold

Updated On : December 19, 2023 / 8:24 PM IST

World Gold Council: భారత్‌లో బంగారానికి డిమాండ్ మరింత పెరగనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అందుకు.. భారత్‌లో పెరుగుతున్న వేతనాలు, యువ జనాభా, పట్టణీకరణనే కారణాలని పేర్కొంది. 2024లో ఈ ధోరణి కనపడుతుందని చెప్పింది. వీటి వల్ల స్వదేశీ బంగారానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది.

బంగారంపై భారతీయులకు ఉండే మక్కువకు తోడు పసిడిని కొనే స్తోమత భారతీయులకు ఉంటుండడంతో భారత్‌లో బంగారానికి డిమాండ్ మరింత పెరగనుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది. ఇతరులపై ఆధారపడి బతికే వారి కంటే పని చేసుకుంటూ జీవించే వయసున్న (15 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు) వారి జనాభా వేగంగా పెరుగుతోందని, ఇది 2040 వరకు కొనసాగుతుందని తెలిపింది.

ఆర్థికంగా భారత్ మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. భారత్‌లోని గ్రామాల్లో బంగారాన్ని అలంకరణ, పెట్టబడులకు బాగా వాడతారని గుర్తు చేసింది. అలాగే, పట్టణాల్లో గోల్డ్ బార్స్, కాయిన్స్ రూపంలో పెట్టుబడులకు అధికంగా వాడతారని తెలిపింది.

మరోవైపు, దేశంలో సంప్రదాయకంగా కొనసాగుతున్న బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులకు ప్రస్తుత పెట్టుబడుల తీరుతెన్నుల వల్ల కొన్ని సవాళ్లు కూడా ఎదురుకావచ్చని పేర్కొంది. ఇందుకు భారతీయులు డిజిటల్ పెట్టుబడుల వైపు మళ్లడమే కారణమని పేర్కొంది.

Why Gold Price is Up?: 2023లో బంగారం ధర ఇంతగా ఎందుకు పెరిగిందో తెలుసా?