Why Gold Price is Up?: 2023లో బంగారం ధర ఇంతగా ఎందుకు పెరిగిందో తెలుసా?
బంగారం ఒక స్థిరాస్తి. అందుకే ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం ఆపన్న హస్తంలా మారుతుందని నిపుణులు చెబుతారు.

బంగారంపై భారతదేశంలో ఉన్నంత మక్కువ మరే దేశంలోనూ ఉండదేమో.. దేశంలోని మహిళలకు బంగారు ఆభరణాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందుకే దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ భారీ మార్పు సంభవించినా దాని ప్రభావం బంగారం రేటులో కనపడుతుంది.
బంగారం ఒక స్థిరాస్తి. అందుకే ఆర్థిక సంక్షోభం సమయంలో బంగారం ఆపన్న హస్తంలా మారుతుందని నిపుణులు చెబుతారు. తాజాగా భారత్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.63 వేలు దాటింది. గత సంవత్సరంతో పోల్చితే ఇది 13 శాతం పెరిగినట్టు. దానికి కారణాలు ఏంటో చూద్దాం..
1) ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకింగ్ రంగంలో ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం
2) బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరగడం. దాంతో దిగుమతులపై ఆధారపడడం.
3) పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడం
4) బంగారాన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో వాడడం
5) బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి రుణాన్ని తీసుకోవడం
6) ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి నెలకొనడం
బంగారంపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయని ప్రజలు నమ్ముతున్నారు.. కాబట్టి రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో కొత్త ఏడాది పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న వారు బంగారంలో పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Gold Price Today : బంగారం ధరకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?