Gold Price Today : బంగారం ధరకు రెక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు ..

Gold Rate
Today Gold and Silver Rate: బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2023 సంవత్సరంలో పసిడి ధర 12శాతం మేర పెరిగింది. 2024లో కూడా గోల్డ్ ధరలు భారీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల కారణమేనని అంచనా వేస్తున్నారు. అయితే, తాజాగా పెరిగిన ధరలను పరిశీలిస్తే.. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. వెయ్యి, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగింది. దీనికితోడు వెండిధరసైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,750కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,000 కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,150.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,000 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,600 కు చేరింది.
పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శనివారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.78,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.