Elon Musk Trillionaire : స్పేస్ఎక్స్ IPOతో సంచలనం.. వరల్డ్ ఫస్ట్ ట్రిలియనీర్‌గా మస్క్.. 1,000,000,000,000 డాలర్లు అంటే నిజంగా ఎంత?
Elon Musk Trillionaire : స్పేస్ఎక్స్ ఐపీఓ ఎలాన్ మస్క్‌ను ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్‌గా మార్చేసింది. 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 95 లక్షల కోట్లు) అనమాట.. 170 దేశాల వ్యక్తిగత జీడీపీ కన్నా పెద్దది. అమెజాన్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, గూగుల్ లారీ పేజ్, సెర్గే బ్రిన్‌ల సంపదకు సమానం..
Elon Musk Trillionaire ( Image Credit : AI )
Elon Musk Trillionaire : ఈ రోజు (జూన్ 12)కు ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? వాల్ స్ట్రీట్‌లో స్పేస్ఎక్స్ ఐపీఓ ఊహించని రీతిలో లాభాల్లో దూసుకెళ్లింది. అదే ఇప్పుడు ఆ సంస్థ అధినేత, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్‌ను ఫస్ట్ ట్రిలియనీర్‌గా మార్చేసింది. వన్ ట్రిలియన్ అంటే.. అక్షరాలా 1,000,000,000,000 అనమాట. ఇందులో 12 సున్నాలు ఉన్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే.. చూడగానే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం..
ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ మస్క్ ఒక్కడే :
అయితే, ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్ మస్క్ మామ ఈ సంపదను సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. జూన్ 12, 2026న ఆయన కంపెనీ స్పేస్ఎక్స్ స్టాక్ మార్కెట్లో ఐపీఓను లిస్ట్ చేసింది. మస్క్ నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 95.10 లక్షల కోట్లు) దాటింది. ఒక మిలియన్ (రూ. 9.5 కోట్లు) అయితే ఒక ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 10 లక్షల కోట్లు అనమాట.
సీఎన్ఎన్ ప్రకారం.. ఒక వ్యక్తి ప్రతిరోజూ గంటకు ఒక మిలియన్ డాలర్లు (రూ. 9.5 కోట్లు) ఖర్చు చేసినా కూడా అంతటి భారీ సంపదను ఖర్చు చేసేందుకు వంద సంవత్సరాలకు పైగా పట్టవచ్చు. జీవితకాలంలో ఒక మిలియన్ డాలర్లు (రూ. 9.5 కోట్లు) సంపాదించడమంటే చాలా మందికి సాధ్యపడదు. ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 95 లక్షల కోట్లు) అంకె ఊహకు అందనిది.
ట్రిలియన్’ అంటే ఎంత పెద్దది? :
ముందుగా, ఒక ట్రిలియన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం.. ఒక ట్రిలియన్ అంటే.. మస్క్ ప్రతిరోజూ ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా కూడా, ఆ డబ్బు ఖర్చు అయ్యేందుకు 2,740 సంవత్సరాలు పడుతుంది. అదే ప్రతి సెకనుకు ఒక డాలర్ చొప్పున లెక్కిస్తే.. ఒక ట్రిలియన్ డాలర్లకు 31,700 ఏళ్లు పడుతుంది.
మీరు ప్రతిరోజూ రూ. కోటి (రూ. 10 మిలియన్లు) ఖర్చు చేస్తే.. 1 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు మీకు 27వేల సంవత్సరాలకుపైగా పడుతుంది. నివేదిక ప్రకారం.. మస్క్ ప్రతిరోజూ రూ. 1 మిలియన్ (రూ. 1 మిలియన్) ఖర్చు చేసినా కూడా ఈ డబ్బంతా ఖర్చు చేసేందుకు 2,740 ఏళ్లు పడుతుంది.
ఒక డాలర్ నోట్ల రూపంలో పేర్చితే.. సుమారు 109,200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భూమి చుట్టూ దాదాపు 3 సార్లు చుట్టడానికి సరిపోతుంది. ఆ డబ్బుతో సుమారు 4.5 ఒలింపిక్-సైజ్ స్విమ్మింగ్ పూల్స్‌ను 100 డాలర్ల నోట్లతో నింపవచ్చు. కేవలం 700 బిలియన్ డాలర్లు (రూ. 66.5 లక్షల కోట్లు) 90 కిలోమీటర్లకు పైగా పొడవున్న రైలులా డబ్బుతో విస్తరించవచ్చు.
ఐపీఓ ఎలా ట్రిలియనీర్‌గా మార్చింది? :
మస్క్ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన నికర ఆస్తి విలువ సుమారుగా 696 బిలియన్ డాలర్లుగా అంచనా. 2026 జూన్ 12న స్పేస్ఎక్స్ నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. కంపెనీ సుమారుగా 555.6 మిలియన్ల షేర్లను ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించింది. దాంతో స్పేస్ఎక్స్ మొత్తం విలువ రూ. 1.77 ట్రిలియన్లకు చేరింది. చరిత్రలోనే ఇది అతిపెద్ద ఐపీఓ అని చెప్పొచ్చు.
మస్క్ ఇప్పుడు స్పేస్ఎక్స్లో సుమారు 42శాతం వాటాతో ఉన్నారు. ఈ వాటా విలువ 743 బిలియన్ డాలర్ల నుంచి 866.5 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. రాయిటర్స్, ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. టెస్లా, ఇతర వ్యాపారాలతో కలిపి మస్క్ నికర ఆస్తి విలువ 1.1 ట్రిలియన్ డాలర్లను దాటింది. మార్కెట్ ముగిసేలోపే మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. ఈ సంపద కేవలం కంపెనీల షేర్ల రూపంలో ఉంది.
ఏ దేశాల జీడీపీ కన్నా మస్క్ సంపద ఎక్కువంటే? :
ఈ మొత్తాన్ని దేశాల మొత్తం జీడీపీతో పోలిస్తే.. IMF ప్రకారం.. ప్రపంచంలో కేవలం 20 దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే 1.1 ట్రిలియన్ డాలర్ల కన్నా పెద్దవిగా ఉన్నాయి. మిగిలిన 175కు పైగా దేశాల మొత్తం వార్షిక ఆదాయం మస్క్ వ్యక్తిగత సంపద కన్నా చాలా తక్కువే.
- మస్క్ సంపద భారత జీడీపీలో (4.15 ట్రిలియన్ డాలర్లు) సుమారు 4వ వంతు.
- పాకిస్తాన్ జీడీపీ (సుమారు 400 బిలియన్ డాలర్లు) కన్నా 2.5 రెట్లు ఎక్కువ.
- తైవాన్ జీడీపీ (సుమారు 977 బిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువ.
- వియత్నాం, పోర్చుగల్, గ్రీస్, న్యూజిలాండ్ డజన్ల కొద్దీ దేశాల జీడీపీ కన్నా పెద్దది.
- మస్క్ సంపదతో ఒక కొత్త దేశాన్ని సృష్టిస్తే.. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల ఫస్ట్ 20 లిస్టులో ఉంటుంది.
అత్యంత ధనవంతులతో పోలిస్తే.. :
చరిత్రలో ధనవంతులుగా కొద్దిమందే ఉన్నారు. కానీ, మస్క్ వారందరినీ అధిగమించాడు. అల్ జజీరా ప్రకారం.. మస్క్ అమెరికా చరిత్రలోని అత్యంత ధనవంతులైన బిలియనీర్లను కూడా అధిగమించాడు. ఆయన సంపద అప్పటి అమెరికా జీడీపీలో 3 శాతానికి సమానం.
- జాన్ జాకబ్ ఆస్టర్ (1848) : 20–30 మిలియన్ డాలర్లు. ఆ సమయంలో యూఎస్ డాలర్ జీడీపీలో ఒక శాతంగా ఉండేది.
- ఆండ్రూ కార్నెగీ (1919) : 380 మిలియన్ డాలర్లు.. జీడీపీలో 0.5 శాతానికి సమానం.
- జాన్ డి. రాక్ఫెల్లర్ (1937) : 1.4 బిలియన్ డాలర్లు.. జీడీపీలో 1.5 శాతానికి సమానం.
- ఎలాన్ మస్క్ (2026) : 1.1 ట్రిలియన్ డాలర్లు.. అమెరికా జీడీపీలో సుమారు 3 శాతం.
ఇండస్ట్రీల కన్నా పెద్దది :
కార్ల విషయానికి వస్తే.. 2025లో అమెరికన్లు 16.3 మిలియన్ల కొత్త కార్ల కోసం సుమారు 789 బిలియన్ డాలర్లు (రూ. 7.49 లక్షల కోట్లు) ఖర్చు చేశారు. బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి లగ్జరీ SUVల వరకు యునైటెడ్ స్టేట్స్ అంతటా ఏడాదిలో అమ్ముడైన ప్రతి కారు ఇదే. అయినా కూడా ఒక ట్రిలియన్ డాలర్లకు సరిపోదు.
రియల్ ఎస్టేట్ విషయానికొస్తే? :
అమెరికాలోని హ్యూస్టన్‌లోని నివాస, వాణిజ్య ఆస్తులన్నింటి వాల్యూ, అమెరికా గృహ మార్కెట్ అంచనాల ప్రకారం.. సుమారుగా 879 బిలియన్ డాలర్లు (రూ. 8.35 లక్షల కోట్లు)గా ఉంది.
ఇతర బిలియనీర్లతో పోలిస్తే.. :
ప్రపంచంలోని అత్యంత ధనవంతులతో పోలిస్త.. అమెజాన్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ లారీ ఎల్లిసన్, గూగుల్ సహ వ్యవస్థాపకులు, లారీ పేజ్, సెర్గే బ్రిన్ ఈ టెక్ దిగ్గజాల సంయుక్త సంపద ఒక ట్రిలియన్ డాలర్లను (రూ. 95 లక్షల కోట్లు) కూడా దాటలేదు.
క్రీడల విషయానికి వస్తే.. :
ఫోర్బ్స్ అంచనాల ప్రకారం.. ప్రపంచంలోని 50 అత్యంత విలువైన క్రీడా జట్ల మొత్తం విలువ సుమారు 353 బిలియన్ డాలర్లు (రూ. 3.35 లక్షల కోట్లు)గా నివేదిక పేర్కొంది. ఇందులో అతిపెద్ద NFL ఫ్రాంచైజీలు, యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లు, NBA జట్లు ఉన్నాయి. సిద్ధాంతపరంగా, మస్క్ వీటన్నింటినీ కొనుగోలు చేసినా ఇంకా వందల బిలియన్ల డాలర్లు మిగిలే ఉంటాయి.
మస్క్ వద్ద ఏ బ్యాంకులోనూ ఒక ట్రిలియన్ డాలర్ల సంపద లేదు.. ఉండదు కూడా. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం.. ఇది కేవలం పేపర్లు, షేర్లలో మాత్రమే. మార్కెట్ విలువలు, హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు పెరిగే కొద్దీ మస్క్ సంపద కూడా పెరుగుతుంది. ఒకవేళ అవి పడిపోతే మస్క్ నికర సంపదలో కొంత భాగాన్ని కోల్పోతాడు. మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అయినా ఆయనే చివరి వ్యక్తి కాకపోవచ్చు.
