Spicejet Services At Gannavaram
Spicejet Plane Services : విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే స్పైస్ జెట్ విమానయాన సంస్ధ తన సర్వీసులను రద్దు చేసింది. గన్నవరం నుంచి నడుస్తున్న స్పైస్ జెట్ విమానాలకు 30 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవటంతో సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆన్లైన్ బుకింగ్ లను కూడా స్పైస్ జెట్ సంస్ధ నిలిపివేసింది.
మరోక రెండు నెలలు వేచి చూసి విమానాలు నడిపేది, లేనిది నవంబర్ లో ప్రకటిస్తామని సంస్ధ తెలిపింది. గన్నవరం నుంచి బెంగుళూరు,హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో గన్నవరం విమానాశ్రయం బోసి పోయింది. గత ప్రభుత్వం హాయంలో 80శాతం ఉన్న బుకింగ్ లు ప్రస్తుతం 30 శాతానికి పడిపోయినట్లు స్పైస్ జెట్ తెలిపింది.