AC’s and Inverters: భానుడి భగభగ.. ఏసీలు, ఇన్వర్టర్లకు ఎప్పుడూలేని డిమాండ్‌!

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు ఎక్కువైయ్యాయి. దీంతో భానుడి ప్రతాపం నుంచి ఉపశమానికి ప్రజలు..ఇన్వర్టర్ల, ఏసీలు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

AC’s and Inverters: వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువైంది. భానుడు భగభగ మండిపోవడంతో.. ప్రజలు మలమల మాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అసని తుపాన్‌ కారణంగా వర్షాలు పడి వాతావరణం చల్లగా ఉంది. వర్షాలు తగ్గితే.. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు ఎక్కువైయ్యాయి. దీంతో భానుడి ప్రతాపం నుంచి ఉపశమానికి ప్రజలు..ఇన్వర్టర్ల, ఏసీలు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో దేశవ్యాప్తంగా ఏసీలు, ఇన్వర్టర్లకు వినియోగం బాగా పెరిగింది. అధిక మొత్తంలో కొనుగోలు చేయడంతో రెట్లు కూడా పెంచేశారు ఉత్పత్తిదారులు. అయినా పోటీపడి కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో ఇన్వర్టర్లకు షార్టేజ్‌ వచ్చింది. మరోవైపు ఈ వేసవిలో ఏసీల కొనుగోలు భారీగా పెరిగిన్నట్లు జస్ట్‌డయల్‌ పరిశీలనలో తేలింది. విద్యుత్‌ కోతలతో ఇన్వర్టర్లకూ డిమాండ్‌ పెరిగింది. ఏప్రిల్‌లో బెంగళూరు, చెన్నై నగరాల్లో 35శాతం మంది ఇన్వర్టర్ల కోసం..దేశం వ్యాప్తంగా 62శాతం మంది ఇన్వర్టర్లు, ఏసీల కోసం జస్ట్‌ డయల్‌ లో సోధించిన్నట్లు వెల్లడించింది.

Summer In Telangana : తెలంగాణాలో పెరిగిన ఎండలు-అల్లాడుతున్న ప్రజలు

ఇలాగే కొనుగోలు చేస్తే..త్వరలో ప్రతి ఇంటిలో ఎదోకటి ఇన్వర్టర్లు, ఏసీలు, కూలర్లు ఉంటాయి. దీంతో కరెంట్‌ బిల్లులు పెరిగి..కుటుంబంలోని నెలవారీ ఖర్చుపై భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్‌ కోతలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో ఏసీలు వేసుకోవద్దని చెప్పం కానీ.. వృథా చేయవద్దు.. ఏసీలు వేసి వదిలేయవద్దు.. ఒక ఇంట్లో వేర్వేరు గదుల్లో ఏసీలు వినియోగించకుండా అందరూ ఒక చోట ఉంటే మంచిది.

ట్రెండింగ్ వార్తలు