Summer In Telangana : తెలంగాణాలో పెరిగిన ఎండలు-అల్లాడుతున్న ప్రజలు

తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Summer In Telangana : తెలంగాణాలో పెరిగిన ఎండలు-అల్లాడుతున్న ప్రజలు

Summer In Telangana

Summer In Telangana : తెలంగాణాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో పరిశీలిస్తే… ఆదిలాబాద్ జిల్లాలో 43.3 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లాలో 42.2, రామగుండంలో 41.4, హనుమకొండలో41, మహబూబ్ నగర్ లో 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఈ రెండు రోజులు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

రాబోయే నాలుగు రోజల పాటు రాష్ట్రంలోని కొన్ని  ప్రాంతాల్లో   తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 48 గంటల్లో హైదరాబాద్ లో అక్కడక్కడ చిరుజల్లులు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Also Read : Tirupati : శోభాయ‌మానంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం