Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ అద్భుతమైన ఫీట్.. 5 మిలియన్ యూనిట్ల మైలురాయిని దాటేసింది..!

Suzuki Access 125 : సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125, యమహా ఫాసినో 125 వంటి వాటికి ప్రత్యర్థిగా 5 మిలియన్ యూనిట్ల మైలురాయిని చేరుకుంది.

Suzuki Access 125 reaches production milestone of 5 million units

Suzuki Access 125 : ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) పాపులర్ స్కూటర్ మోడల్ సుజుకి యాక్సెస్ 125 అద్బుతమైన ఫీట్ సాధించింది. మొత్తంగా 5 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుందని కంపెనీ ప్రకటించింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో టూ-వీలర్ తయారీదారుల ఖేర్కి ధౌలా ప్లాంట్ నుంచి యాక్సెస్ 125 స్కూటర్ 5 మిలియన్ల యూనిట్ లాంచ్ చేసింది.

సుజుకి ఖేర్కీ ధౌలా ప్లాంట్ వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 1.1 మిలియన్ యూనిట్లను కలిగి ఉండగా.. హర్యానాలోని సోనిపట్‌లోని IMT ఖార్‌ఖోడాలో మరో కొత్త తయారీ ప్లాంట్ రాబోతోంది. IMT ఖార్‌ఖోడా ప్లాంట్‌లో మొదటి దశలో కంపెనీ రూ. 200 కోట్లు పెట్టుబడి పెడుతుంది.

Read Also : Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?

5 లక్షల యూనిట్ల వార్షిక స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సుజుకి యాక్సెస్ 125 భారత మార్కెట్లో 2007లో లాంచ్ అయింది. అప్పటికి 125cc సెగ్మెంట్‌లో మొదటి స్కూటర్ అని చెప్పవచ్చు. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ వరుసగా రూ. 79,600 రూ. 89,500 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరతో హోండా యాక్టివా 125, TVS జూపిటర్ 125, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125, యమహా ఫాసినో 125 వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది.

Suzuki Access 125 reaches production milestone of 5 million units

సుజుకి యాక్సెస్ 125లో 124cc, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, FI ఇంజన్ ఉంది. గరిష్టంగా 8.7PS పవర్, 10Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ CVTతో వస్తుంది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియాలో ప్రధాన మైలురాయిగా చెప్పవచ్చు.

దేశీయ విదేశీ మార్కెట్‌లలో యాక్సెస్ 125పై నిబద్ధత, వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ అన్నారు. ఈ విశేషమైన ఫీట్‌ను సాధించడానికి మద్దతు ఇచ్చినందుకు విలువైన కస్టమర్‌లు, డీలర్ భాగస్వాములు, అసోసియేట్‌లు, సహోద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. యాక్సెస్ 125 స్కూటర్ పూర్తిగా భారతీయ కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసిన అద్భుతమైన ఫీచర్‌లతో వచ్చిందన్నారు.

Read Also : OnePlus 12 Key Specifications : కెమెరా ఫీచర్లతో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే డిజైన్, కీలక స్పెషిఫికేషన్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు