Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?

Maruti Suzuki Fronx CNG : కొత్త కారు కొంటున్నారా? మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్ CNG వెర్షన్ కారు భారత మార్కెట్లో లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

Maruti Suzuki Fronx CNG : అద్భుతమైన ఫీచర్లతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG వెర్షన్.. కొత్త కారు ధర ఎంతంటే?

Maruti Suzuki Fronx CNG launched, price starts at Rs 8.41 lakh

Maruti Suzuki Fronx CNG : ప్రముఖ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) కొత్త కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్ CNG వెర్షన్‌ను రూ. 8.41 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. మారుతి సుజుకి (Fronx CNG) కంపెనీకి చెందిన 15వ CNG కారు, ఆల్టో, ఆల్టో K10, S-Presso, Celerio, Eeco, WagonR, Swift, Dzire, Ertiga, Baleno, Brezza, XL6, Grand Vitara, Tour S. 2010 నుంచి ప్రారంభించింది. మారుతి ఇప్పటి వరకు భారత మార్కెట్లో 1.4 మిలియన్ కన్నా ఎక్కువ CNG వాహనాలను విక్రయించింది.

సుమారు 1.44 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను ఆదా చేస్తుందని పేర్కొంది. CNG మోడల్స్ మారుతి మొత్తం వాల్యూమ్‌కు 26శాతానికి పైగా కలిగి ఉంటాయి. Fronx CNG 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ గరిష్టంగా 89.73PS పవర్, 113Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. CNG మోడ్‌లో గణాంకాలు 77.5PS, 98.5Nmకి తగ్గుతాయి. ఆటోమేటిక్ ఆప్షన్ లేకుండా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆఫర్‌లో ఉంది.

Read Also :  Maruti Suzuki Invicto : మారుతి సుజుకి ఇన్విక్టో బుకింగ్స్.. ఒక వేరియంట్.. ఒక కలర్ ఆప్షన్ మాత్రమే.. త్వరపడండి..!

Fronx CNG మైలేజ్ 28.51 km/kg అందిస్తుంది. ఆటోమొబైల్ పరిశ్రమలోని CNG కార్ల విషయానికొస్తే.. సిగ్మా, డెల్టా అనే రెండు వేరియంట్లలో వస్తుంది. వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి. (Fronx CNG) సిగ్మా ధర రూ. 8.41 లక్షలు, (Fronx CNG) డెల్టా ధర రూ. 9.27 లక్షలు ఉంటుంది.

Maruti Suzuki Fronx CNG launched, price starts at Rs 8.41 lakh

Maruti Suzuki Fronx CNG launched, price starts at Rs 8.41 lakh

ఫ్రాంక్స్ S-CNG కొత్త-యుగం డైనమిక్ రోడ్ ప్రెజెన్స్‌తో కేవలం ట్రయిల్‌బ్లేజర్‌లు మాత్రమే కాకుండా పర్యావరణ స్పృహ ఉన్న కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఏడాదిలో ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టినప్పటి నుంచి Fronx అఖండమైన ఆదరణ పొందింది. స్పోర్టీ డిజైన్ లాంగ్వేజ్, అధునాతన పవర్‌ట్రెయిన్, ప్రీమియం టెక్నాలజీతో వస్తుందని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. 2010లో మొదటి CNG-కస్టమైజడ్ మోడల్‌ను ప్రవేశపెట్టామన్నారు.

అప్పటి నుంచి దేశంలో 1.4 మిలియన్ల కన్నా ఎక్కువ S-CNG వాహనాలను విక్రయించినట్టు తెలిపారు. కంపెనీ టెక్నాలజీపై వినియోగదారుల విశ్వాసానికి నిజమైన నిదర్శనమని ఆయన చెప్పారు. Fronx S-CNG మొత్తం విక్రయాలలో S-CNG కార్ల వాటాను పెంచుతుందని, గ్రీన్ మొబిలిటీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుందని నమ్మకంగా ఉందని శశాంక్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మారుతి సుజుకి దేశ మార్కెట్లో అత్యుత్తమమైన 15 మోడళ్లను కలిగి ఉందని శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Read Also : Honda Elevate Bookings : కొత్త కారు కావాలా? హోండా ఎలివేట్ బుకింగ్స్ ఓపెన్.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి.. సెప్టెంబర్‌లోనే లాంచ్!