మానసిక ప్రశాంతతకోసం చాలామంది తమకున్న కొద్దిపాటి సమయాన్ని దైవ ధ్యానం లో గడపటమో… సేవా కార్యక్రమాలకు వెచ్చించటమో..దీన జనోధరణ కోసమో కేటాయిస్తూ ఉంటారు. అదే బడా బడా పారిశ్రామకి వేత్తలు విదేశాలకు టూర్ కు వెళ్లి తమ తమ ఫ్యామిలీస్ తో గడుపుతూ ఉంటారు.
స్వీడన్ కు చెందిన ఒక పారిశ్రామిక వేత్త ఇండియా వచ్చి అలాంటి సేవే చేస్తున్నాడు కానీ అతనికి ఇంకా మానసిక ప్రశాంతత లభించక తమిళనాడులోని కోయంబత్తూరు లో భిక్ష మెత్తుకుని మానసిక ప్రశాంతత పొందుతున్నాడు. స్వీడెన్ దేశానికి చెందిన పారిశ్రామిక వేత్త కిమ్ కొన్ని నెలల క్రితం కోయం బత్తూరు వచ్చి అక్కడి ఈషా యోగా కేంద్రంలో చేరాడు.
అక్కడి పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేస్తూ కాలం గడుపుతున్నాడు. అయినా ఆయనకు మానసిక ప్రశాంతత లభించలేదు. దీంతో కిమ్ కోవై వీధుల్లో రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్నాడు. ప్రజలు ఇచ్చే 5,10 రూపాయలు తీసుకుని ఆమె జీవనం గడుపుతున్నాడు. ధనికుడైన కిమ్ కొవై వీధుల్లో భిక్ష మెత్తుకోవటం ఇప్పుడు అక్కడ చర్చనీయాంశం అయ్యింది.
Read More>>స్కూల్లోనే విద్యార్ధులతో టిక్ టాక్ వీడియోలు చేయిస్తున్న టీచర్ల