×
Ad

Gig workers: న్యూఇయర్‌ వేళ ఝలక్.. దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్‌ సమ్మె

నిరసన పిలుపు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చింది.

Gig and platform workers (Pic credit original source)

  • యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో డిమాండ్లు
  • పనుల్లో తాము ఎందుర్కొంటున్న పరిస్థితులపై నిరసన
  • వేతన విధానాల్లో మార్పులు కోరుతున్న వర్కర్లు
  • ఆయా యాప్‌లలో డెలివరీ సేవలు ప్రభావితం

Gig workers: దేశవ్యాప్తంగా గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లు బుధవారం సమ్మెకు దిగారు. న్యూ ఇయర్‌ ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సమ్మెలో స్విగ్గి, జొమాటో, జెప్టో, అమెజాన్ సంస్థలకు చెందిన వర్కర్లు పాల్గొన్నారు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఆధ్వర్యంలో పలు డిమాండ్లను లేవనెత్తారని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.

పనుల్లో తాము ఎందుర్కొంటున్న పరిస్థితులు, వేతన విధానాల్లో మార్పులు కోరుతున్నారు. ఈ సమ్మె కారణంగా ఆయా యాప్‌లలో డెలివరీ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

Also Read: Khaleda Zias funeral: బంగ్లాదేశ్‌కు వెళ్లిన జైశంకర్.. మోదీ లేఖను ‘డార్క్ ప్రిన్స్’కు అందజేత

నిరసన పిలుపు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చింది. వర్కర్లు ఎదుర్కొంటున్న అన్యాయపూరిత విధానాలకు ప్రతిస్పందనగా ఈ సమ్మె నిర్వహిస్తున్నామని సలావుద్దీన్ తెలిపారు. వర్కర్లు లేవనెత్తిన అనేక సమస్యలపై ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత కూడా పరిష్కారం దొరకలేదని ఆయన చెప్పారు.

ప్లాట్‌ఫాం కంపెనీల వద్ద వర్కర్లు పాత చెల్లింపు విధానాన్ని పునరుద్ధరించాలని కోరారని ఆయన చెప్పారు. “దసరా, దీపావళి, బక్రీద్ వంటి పండుగల సమయంలో న్యాయంగా చెల్లింపులు జరిగేవి. ఆ విధానం మళ్లీ క్రమం తప్పకుండా అమలులోకి రావాలి” అని సలావుద్దీన్ అన్నారు.

ప్రస్తుత మోడల్‌తో పోల్చితే పాత విధానం స్థిరంగా, పారదర్శకంగా ఆదాయం ఇచ్చిందని వర్కర్లు చెబుతున్నారు.
10 నిమిషాల డెలివరీ విధానాన్ని ఉపసంహరించాలన్నారు. ఈ మోడల్ ఒత్తిడి పెంచుతుందని, రహదారులపై భద్రతకు ముప్పు తెస్తుందని వర్కర్లు అంటున్నారు.