Tata PV, EV prices to increase in April 2025
Tata Car Prices : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇప్పుడే కొనేసుకోవడం బెటర్.. ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు కార్ల ధరల పెంపుపై ప్రకటించాయి.
తాజాగా ఇప్పుడు టాటా మోటార్స్ కూడా కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఏప్రిల్ 2025లో ప్యాసింజర్ వాహనాలు (PV), ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలను పెంచనున్నట్టు వెల్లడించింది.
Read Also : వార్నీ.. భలే ఉందిగా ఫోన్.. భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ 5G ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర..
ఏప్రిల్ 1, 2025 నుంచి టాటా కమర్షియల్ వెహికల్స్ (CV) ధరలను కూడా 2శాతం వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ఆటో దిగ్గజం టాటా ప్యాసెంజర్ వెహికల్ రేంజ్‌లో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ ఉన్నాయి.
కంపెనీ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లలో Tiago.ev, Tigor.ev, Punch.ev, Nexon.ev, Curvv.ev ఉన్నాయి. ప్రతి PV, EV కార్లపై ధరల పెంపును టాటా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, టాటా మోడల్, వేరియంట్‌ను బట్టి పెరుగుదల ఉంటుందని చెప్పవచ్చు.
భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్.. ఏప్రిల్ 2025 నుంచి భారీగా ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలతో సహా ప్యాసింజర్ వాహనాల రేంజ్ ధరలను పెంచనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు తప్పనిసరిగా చెబుతోంది.
టాటా కార్లలో మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. జనవరి 2025లో టాటా PV, EV, CV కార్ల ధరలను అమాంతం పెంచింది. ఒరిజినల్ ఈక్విప్‌మెంట్ మ్యానిఫ్యాక్చర్స్ (OEM) సాధారణంగా ప్రతి ఏడాదిలో రెండుసార్లు కార్ల ధరలను పెంచుతారు. దేశంలో అతిపెద్ద ప్యాసెంజర్ వెహికల్ తయారీదారు మారుతి సుజుకి ఇండియా కూడా ఏప్రిల్ 2025లో తన కార్ల ధరలను దాదాపు 4శాతం పెంచనుంది.