నానోకి టాటా : వరల్డ్ చీప్ కారు గుడ్ బై
ప్రపంచంలోనే చీప్ కారు ఏది అంటే ఠక్కున నానో అని చెబుతాం. రతన్ టాటా కల నుంచి సాకారమైన ఈ నానో కారు గుడ్ బై చెబుతోంది.

ప్రపంచంలోనే చీప్ కారు ఏది అంటే ఠక్కున నానో అని చెబుతాం. రతన్ టాటా కల నుంచి సాకారమైన ఈ నానో కారు గుడ్ బై చెబుతోంది.
ప్రపంచంలోనే చీప్ కారు ఏది అంటే ఠక్కున నానో అని చెబుతాం. రతన్ టాటా కల నుంచి సాకారమైన ఈ నానో కారు గుడ్ బై చెబుతోంది. 2020 ఏప్రిల్ నెల నుంచి తయారీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది టాటా కంపెనీ. మధ్య తరగతికి తక్కువ ధరలో కారు అందించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకు వచ్చారు. కేవలం లక్ష రూపాయలతోనే కారు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రజల నుంచి ఆదరణ కరువు అయ్యింది. రిలీజ్ కాకముందు ఉన్న డిమాండ్.. నానో కారు రోడెక్కిన తర్వాత లేదు. క్రమంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి. ప్రజల ఆదరణ లభించలేదు. దీంతో క్రమంగా తయారీని తగ్గిస్తూ వచ్చిన టాటా కంపెనీ.. ఏకంగా ఇప్పుడు మూసివేస్తోంది. ఏప్రిల్ తర్వాత నానో కార్ల తయారీ ఉండదని ప్రకటించింది. ప్రస్తుతం సిద్ధంగా ఉన్న కార్లను విక్రయించి.. ఈ ప్రాజెక్ట్ మూసివేయనుంది కంపెనీ.
బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వేకిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ ప్రకటించారు. నానో కారును సనద్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నాం. జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి.. ఏప్రిల్‌లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్‌లో మరికొన్ని. ఇక 2020 ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు రానున్నాయి. అన్ని ఉత్పత్తులను ఈ స్థాయిలో చేయడానికి పెట్టుబడులు పెట్టలేం అని వెల్లడించారు. అందులో నానో ఒకటి అని మయాంక్ స్పష్టం చేశారు.
కొంతకాలంగా ఈ కారు కొనేవారు కరువయ్యారు. పదేళ్లలోనే నానో కథ ముగిసింది. ఇప్పటికే నానో సేల్స్ నిలిచిపోయాయి. నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్ వెకిల్స్ తయారీని కూడా నిలిపేయాలని అనుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించటం విశేషం. ఇప్పటికే అనధికారింగా నానో తయారీని నిలిపివేసినా.. అధికారికంగా మాత్రం 2020 ఏప్రిల్ నుంచి క్లోజ్ కానుంది.