Top SUV Sales in September : సెప్టెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ SUV కార్లు ఇవే.. టాటా నెక్సాన్ రికార్డు సేల్స్..!

Top SUV Sales in September 2023 : సెప్టెంబరు 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన SUV పాపులర్ మోడల్ కార్లలో టాటా నెక్సాన్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా ఉన్నాయి.

Tata Nexon top SUV sales in September

Top SUV Sales in September : 2023 సెప్టెంబర్‌లో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. దేశీయ హోల్‌సేల్ పరంగా సెప్టెంబర్‌లో రికార్డు సేల్స్ జరిగాయి. ఆటో పరిశ్రమలో అత్యధిక నెలవారీ వాల్యూమ్‌ను 360,897 యూనిట్లుగా నమోదు చేసింది. ఏకంగా SUV విభాగంలో 52శాతం ఎక్కువగా నమోదైంది. అత్యధికంగా అమ్ముడైన SUV పాపులర్ మోడల్ కార్లలో టాటా నెక్సాన్‌ (Tata Nexon SUV Sales) అగ్రస్థానంలో నిలిచింది.

ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza), టాటా పంచ్ (Tata Punch), హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ఉన్నాయి. అయితే, సెప్టెంబర్‌లో SUV సెగ్మెంట్ అద్భుతంగా కొనసాగడంతో ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్ల మోడల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

టాప్ 3లో నెక్సన్, బ్రెజ్జా, పంచ్.. :
టాటా నెక్సాన్ SUV సెగ్మెంట్ 15,325 యూనిట్ల వద్ద టాపర్‌గా నిలిచింది. 15,001 యూనిట్ల వద్ద మారుతి సుజుకి బ్రెజ్జా తర్వాతి స్థానంలో ఉంది. టాటా పంచ్ 13,045 యూనిట్ల వద్ద కొనసాగించింది.

Read Also : Record Sales for Hyundai : సెప్టెంబర్‌ 2023లో హ్యుందాయ్ రికార్డు సేల్స్.. SUV పోర్ట్‌ఫోలియోలో 71,641 యూనిట్లు

ఆ తర్వాతి స్థానాల్లో క్రెటా, వెన్యూ, స్కార్పియో :
హ్యుందాయ్ క్రెటా 12,717 యూనిట్ల అమ్మకాలతో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. హ్యుందాయ్ వెన్యూ 12,204 యూనిట్లను సాధించింది. మహీంద్రా స్కార్పియో (N, క్లాసిక్) 11,846 యూనిట్ల విక్రయాలతో మరోసారి ఆకట్టుకుంది.

గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, సెల్టోస్, బొలెరో :
మారుతి సుజుకి గ్రాండ్ విటారా స్థిరంగా అధిక వాల్యూమ్‌లను అందిస్తోంది. సెప్టెంబరులో 11,736 యూనిట్ల వద్ద నిలిచింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 11,455 యూనిట్ల వద్ద చాలా వెనుకబడి ఉంది. కియా సెల్టోస్ 10,558 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. మహీంద్రా బొలెరో సెప్టెంబర్‌లో 9,519 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన SUVలలో 10వ స్థానంలో ఉంది.

Top SUV Sales in September 2023

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్లు : 

* టాటా నెక్సాన్ – 15,325 యూనిట్లు
* మారుతి సుజుకి బ్రెజ్జా – 15,001 యూనిట్లు
* టాటా పంచ్ – 13,045 యూనిట్లు
* హ్యుందాయ్ క్రెటా – 12,717 యూనిట్లు
* హ్యుందాయ్ వెన్యూ – 12,204 యూనిట్లు
* మహీంద్రా స్కార్పియో – 11,846 యూనిట్లు
* మారుతి సుజుకి గ్రాండ్ విటారా – 11,736 యూనిట్లు
* మారుతి సుజుకి ఫ్రాంక్స్ – 11,455 యూనిట్లు
* కియా సెల్టోస్ – 10,558 యూనిట్లు
* మహీంద్రా బొలెరో – 9,519 యూనిట్లు

Read Also : Pixel 8 Series Launch : భలే ఉందిగా బ్రో.. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ వచ్చేసిందోచ్.. పిక్సెల్ వాచ్ 2 కూడా కొనేసుకోండి.. ధర ఎంతో తెలుసా?