Tata Punch EV
Tata Punch EV : కొత్త కారు కొంటున్నారా? ఈ ఏప్రిల్ నెలలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్లపై భారీ డిస్కౌంట్ డీల్స్ అందిస్తున్నాయి. టాటా కంపెనీ టాటా పంచ్ EV కార్ మోడళ్లపై 30 వేల రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది.
అందులో అత్యుత్తమ 5 సీట్ల కారు.. ఆకట్టుకునే రేంజ్, అడ్వాన్స్ లెవల్ ఫీచర్లతో వస్తుంది. మీ ఫ్యామిలీ కోసం కారు కొనేందుకు చూస్తుంటే.. ఇదే సరైన సమయం. ఈ కారు డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
టాటా పంచ్ EV డిస్కౌంట్, ఆన్ రోడ్ ధర :
టాటా కంపెనీ పర్ఫార్మెన్స్ పరంగా రాక్‌స్టార్ కంపెనీ. ఇప్పుడు ఎలక్ట్రిక్ లైనప్, పంచ్ EV 2024 మోడల్ కార్లపై రూ. 70వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కంపెనీ రెండు రకాల డిస్కౌంట్లను చూస్తే.. ఒకటి అదనపు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్. రెండింటితో డిస్కౌంట్ ధర 30వేలు వరకు పొందవచ్చు.
ధర విషయానికి వస్తే.. ఈ SUV ధర 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అప్పర్ వేరియంట్ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 14.44 లక్షలు. బేస్ మోడల్ ఆన్-రోడ్ ఢిల్లీ ధర 10.45 లక్షలు. అన్ని డిస్కౌంట్లను కలుపుకుంటే మీరు ఈ కారును దాదాపు 10.10 లక్షలకు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.
టాటా పంచ్ EV స్పెసిఫికేషన్ :
ఈ కారులోని ముఖ్యమైన ఫీచర్లు అద్భుతంగా ఉంటాయి. కంపెనీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆపిల్ కార్పొరేట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్ట్, అడ్వాన్స్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కూడిన ఎయిర్ కండిషనర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీటు వంటి మల్టీ ఫీచర్లను అందిస్తుంది.
టాటా పంచ్ EV రేంజ్ :
ముందుగా, ఈ మోడల్ బ్యాటరీ రేంజ్ విషయానికి వస్తే.. కంపెనీ 35kWh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించింది. ఆ మోటారు 120.69bhp పవర్, 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. ఈ పవర్‌ఫుల్ బ్యాటరీ, ఇంజిన్‌తో ఈ కారు మీకు 421 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ కారు 100 శాతం ఛార్జ్ పూర్తి అయ్యేందుకు 5 గంటలు పడుతుంది. ఆపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
టాటా పంచ్ EV కంఫర్టబుల్ :
ఈ కారు మల్టీ ఫంక్షన్‌లను అందిస్తుంది. సౌకర్యవంతమైన డిజైన్, అడ్వాన్స్ టెక్నాలజీని అందిస్తుంది. సౌకర్యంతో పాటు భద్రతపరంగా చాలా బెస్ట్. ఈ కారులో మీరు డిస్క్ బ్రేక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన భారీ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. మీరు నగరంలో డ్రైవింగ్ చేసినా లేదా లాంగ్ రైడ్‌లు చేసినా టాటా పంచ్ EV డ్రైవ్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.