Jio Offers : జియో యూజర్లకు పండగే.. 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. OTT బెనిఫిట్స్ కూడా!

Jio Offers : జియో యూజర్ల కోసం సరికొత్త 3 రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 3GB రోజువారీ డేటా, 5G డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అద్భుతమైన డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.

Jio Offers : జియో యూజర్లకు పండగే.. 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. OTT బెనిఫిట్స్ కూడా!

Jio Prepaid Plans

Updated On : April 5, 2025 / 4:23 PM IST

Jio Offers : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. దేశంలో వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జియో తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తూనే ఉంది. ఇందులో రీఛార్జ్ ప్లాన్‌ల ధరను మార్కెట్ డిమాండ్ బట్టి మార్పులు చేర్పులు చేస్తోంది.

దేశంలోని ప్రతి మూలలో 5G సర్వీసులను జియో ప్రారంభించింది. అయినప్పటికీ, భారీ మొబైల్ వినియోగంతో హై-FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) కావచ్చు.. రోజువారీ డేటాతో రీఛార్జ్ ప్లాన్‌ల కోసం 4G డేటాపై ఆధారపడే మిలియన్ల మంది యూజర్లు ఇప్పటికీ ఉన్నారు.

Read Also : itel King Signal : ట్రిపుల్ సిమ్‌తో కొత్త బడ్జెట్ ఫోన్ ఆగయా.. కేవలం రూ.1,399కే.. ఫీచర్లు భలే ఉన్నాయి.. కీప్యాడ్ మాత్రం కేక..!

ఇలాంటి యూజర్ల కోసం జియో రోజుకు 3GB డేటాను అందించే 3 అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. రూ.449, రూ.1199, రూ.1799 ధరల ప్లాన్‌లు జియోహాట్‌స్టార్ మొబైల్‌కు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తున్నాయి.

జియో ఈ రీఛార్జ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించింది. ఈ ప్లాన్‌లతో అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. 3GB రోజువారీ FUP డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కొన్నిసార్లు 5G నెట్‌వర్క్‌లో కొన్నిసార్లు 4G నెట్‌వర్క్‌ ఏది కావాలంటే అది ఈజీగా మారిపోవచ్చు.

జియో 3GB రోజువారీ డేటా ప్లాన్లు :
జియో రూ. 449 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 3GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందుతారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. దాంతో పాటు, జియోసినిమా (Hotstar Mobile)కు 3 నెలల ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చ. అంతేకాదు.. 50GB జియోక్లౌడ్ స్టోరేజీని కూడా ఉచితంగా అందిస్తోంది.

జియో రూ.1199 ప్లాన్ :
ఈ ప్లాన్ రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ 5G డేటాతో కూడా వస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో జియోహాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, 50GB జియోక్లౌడ్ స్టోరేజీ కూడా ఉన్నాయి.

జియో రూ.1799 ప్లాన్ :
ఈ ప్లాన్ చాలా పాపులర్. ఎందుకంటే.. 3GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, Netflix బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో రోజుకు 100 SMS (84 రోజులు) ఉచితంగా అందిస్తుంది. ఇందులో జియోహాట్‌స్టార్ మొబైల్ (90 రోజులు), 50GB (JioAICloud) స్టోరేజీ, అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉన్నాయి. జియోహాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ 2025 ఏప్రిల్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు 4G-5G నెట్‌వర్క్‌లను ఎక్కువగా వాడితే ఈ 3 ప్లాన్‌లు బెస్ట్ ఆప్షన్.

Read Also : City Killer Asteroid : అయ్య బాబోయ్.. 10 అంతస్తుల బిల్డింగ్ సైజులో భారీ గ్రహశకలం.. మనమైతే సేఫ్.. చంద్రుడిని ఢీకొట్టబోతుందా?

జియో రీఛార్జ్ ప్లాన్ పొడిగింపు :
జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇప్పుడు కంపెనీ ఈ ప్లాన్ పొడిగించాలని నిర్ణయించింది. రీఛార్జ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఇప్పుడు ఈ ప్లాన్‌ బెనిఫిట్స్ ఏప్రిల్ 15 వరకు పొందవచ్చు.