Tata Technologies IPO : ఇన్వెస్టర్ల హంగామా.. 20ఏళ్ల తర్వాత ఐపీఓలోకి టాటా టెక్నాలజీస్.. రూ. లక్ష కోట్లకుపైగా బిడ్స్!

Tata Technologies IPO : టాటా టెక్నాలజీస్ 20 ఏళ్ల తర్వాత ఐపీఓ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాంతో ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ పెరిగింది. రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లను అందుకుంది.

Tata Technologies IPO : ప్రముఖ దేశీయ దిగ్గజం కంపెనీ టాటా గ్రూపుకు చెందిన టాటా టెక్నాలజీస్ 20ఏళ్ల తర్వాత ఐపీఓ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో పెట్టుబడిదారుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు పెరిగింది. తద్వారా టాటా షేర్లకు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ పెరిగింది. టాటా టెక్నాలజీస్ అనేది ప్యూర్-ప్లే మాన్యుఫ్యాక్చరింగ్-ఫోకస్డ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఈఆర్&డీ ) కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ పరిశ్రమపై దృష్టి సారించింది.

Read Also : Elon Musk : ఏడేళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలిసిన ఎలన్ మస్క్.. ఫ్యామిలీ ఫుల్ ఎమోషనల్!

ఈ క్రమంలో అంచనాలకు మించి, టాటా టెక్నాలజీస్ రూ. 3వేల కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)తో ముందుకు రాగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన బిడ్‌లను అందుకుంది. రూ.1.07 లక్షల కోట్ల విలువైన బిడ్లకు సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి అధిక స్థాయిలో మద్దతు లభించింది. ఫలితంగా, టాటా టెక్నాలజీస్ షేర్లకు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో అధిక డిమాండ్ పెరిగింది. ఐపీఓ ధరతో పోలిస్తే 80శాతం కన్నా ఎక్కువ ప్రీమియాన్ని అందుకుంది.

టాటా ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా మద్దతు :

ఈ వారంలో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు భారీగా మద్దతు లభించింది. టాటా టెక్నాలజీస్ మొత్తంగా రూ. 4.5 కోట్ల షేర్లను ఐపీఓలో బిడ్ల దాఖలు చేసేందుకు ప్రతిపాదించింది. నవంబర్ 22 నుంచి ప్రారంభమైన బిడ్ల కొనుగోలు ప్రక్రియ నవంబర్ 24 (ఈరోజు)కి ముగిసింది. ఇప్పటివరకూ మొత్తంగా 312.42 కోట్ల టాటా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. అంటే.. రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్లకు బిడ్లను అందుకుంది.

ఐపీఓలో టాటా టెక్నాలజీస్ షేర్ విలువ రూ.475 నుంచి రూ. 500గా నిర్ణయించింది. మొదటిరోజున 6.54 రెట్లు ఇన్వెస్టర్లు మద్దతు పలికారు. రెండో రోజున 14.85 రెట్లు బిడ్లు అందాయి. చివరి రోజున ఇన్వెస్టర్లు అధిక సంఖ్యలో బిడ్లు దాఖలు చేయడంతో మొత్తంగా 69.43 రెట్లు ఎక్కువగా బిడ్లు వచ్చాయి.

Tata Tech IPO subscribed final day of offer

గత వారంలో, బెంచ్‌మార్క్ సూచీలు లాభనష్టాల మధ్య దూసుకుపోయాయి. ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్స్ మినహా మిగిలిన నాలుగు ఐపీఓలు పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందాయి. టాటా టెక్నాలజీస్ మొత్తం సబ్‌స్క్రిప్షన్ ముగింపులో దాదాపు 70 రెట్లు ఉండగా, నిన్న ముగిసిన ఐఆర్‌ఈడీఏ ఐపీఓ 39 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. గాంధార్ ఆయిల్ పబ్లిక్ ఆఫర్ 64 సార్లు బుక్ అయింది. ఫ్లెయిర్ రైటింగ్ ఆఫర్‌లో ఉన్నదాని కన్నా 46 రెట్లు ఎక్కువ బిడ్‌లను అందుకుంది.

టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా 6.08 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద11.4 శాతం వాటాను సూచిస్తూ 4.63 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేసింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ 97.17 లక్షల షేర్లను లేదా 2.4 శాతం వాటాను విక్రయించింది. టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48.58 లక్షల షేర్లలో 48.52 శాతాన్ని నమోదు చేసింది. బుధవారం బిడ్డింగ్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే టాటా టెక్నాలజీస్ ఐపీఓ పూర్తిగా సభ్యత్వం పొందింది. టాటా టెక్నాలజీస్ ఇన్వెస్టర్ల నుంచి రూ.791 కోట్లు వసూలు చేసినట్లు మంగళవారం తెలిపింది.

Read Also : Whatsapp Chat Backup : మీ వాట్సాప్ చాట్‌ స్టోరేజీకి పేమెంట్ చేయడం లేదా? వెంటనే ఈ సెట్టింగ్‌ని మార్చండి!

ట్రెండింగ్ వార్తలు