Tata Cars Launch : కొత్త కారు కొంటున్నారా? టాటా నుంచి సరికొత్త మోడల్ కార్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

Tata Cars Launch : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు భారత మార్కెట్లో కొత్త కార్ల మోడల్స్ దించుతున్నాయి. లేటెస్టుగా టాటా మోటార్ నుంచి రెండు సరికొత్త మోడల్ కార్లు లాంచ్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Tata Tiago CNG AMT, Tigor CNG AMT launched in India

Tata Cars Launch : కొత్త కారు ఏది కొనాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే, 2024లో భారత మార్కెట్లోకి టాటా కొత్త మోడల్ కార్లు వచ్చేశాయి. టాటా మోటార్స్ టియాగో సీఎన్‌జీ ఏఎంటీ, టిగోర్ సీఎన్‌జీ ఏఎంటీ కార్ల మోడల్‌ను లాంచ్ చేసింది.

ఈ రెండు మోడల్ కార్లలో మొదటి మోడల్ ధర రూ. 7,89,900 (ఎక్స్-షోరూమ్) ఉండగా.. రెండో కారు మోడల్ ధర రూ. 8,84,900 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. టియాగో సీఎన్‌జీ టిగోర్ సీఎన్‌జీ భారత మార్కెట్లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MMT) కలిగిన తొలి సీఎన్‌జీ కార్లు. ఈ కార్ల మైలేజ్ 28.06 కిలోమీటర్లు అందిస్తాయి. రెండు మోడళ్లలో అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Read Also :  Flipkart Valentine Week Sale : ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్ వీక్ సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 12వేలకు పైగా డిస్కౌంట్..

టియాగో, టిగోర్‌లు ఒకే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ మోడ్‌లో 86పీఎస్, 113ఎన్ఎమ్, సీఎన్‌జీ మోడ్‌లో 73.4పీఎస్ 95ఎన్ఎమ్‌లను అభివృద్ధి చేస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు రెండూ ఇప్పుడు 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. వేరియంట్ వారీగా టాటా టియాగో సీఎన్‌జీ ఏఎంటీ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింద విధంగా ఉన్నాయి.

  • ఎక్స్‌జెడ్ఏ – రూ. 7,89,900
  • ఎక్స్‌జెడ్ఏ ప్లస్ – రూ. 8,79,900
  • ఎక్స్‌జెడ్ఏ ప్లస్ డీటీ – రూ. 8,89,900
  • ఎక్స్‌జెడ్ఏ ఎన్ఆర్‌జీ – రూ. 8,79,900

వేరియంట్ వారీగా టాటా టిగోర్ సీఎన్‌జీ ఏఎంటీ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

Tata CNG AMT launch

  • ఎక్స్‌జెడ్ఏ : రూ. 8,84,900
  • ఎక్స్‌జెడ్ఏ ప్లస్ : రూ. 9,54,900

టాటా టియాగో కోసం టోర్నాడో బ్లూ, టియాగో ఎన్‌ఆర్‌జికి గ్రాస్‌ల్యాండ్ బీజ్, టిగోర్ కోసం మెటోర్ బ్రాంజ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది.

Read Also :  Moto G04 Launch India : కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? మోటో G04 వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?