Tax Saving Scheme
Tax Saving Scheme : పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయా? అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఒకటి ఉంది.. ఇందులో పెట్టుబడి పెడితే టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
అదే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఉపయోగించే పన్ను చెల్లింపుదారులు మాత్రమే (Tax Saving Scheme) ఈ మినహాయింపును క్లెయిమ్ చేయగలరు.
ఆర్థిక సంవత్సరంలో PPFలో రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి ద్వారా మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒక వ్యక్తి PPFలో ప్రతి నెలా రూ. 12,500 పెట్టుబడి పెడితే.. ఆర్థిక సంవత్సరంలో మొత్తం పెట్టుబడిపై మినహాయింపు కోసం క్లెయిమ్ చేయొచ్చు.
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం మార్చలేదు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఇందులో PPF, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. PPFపై వడ్డీ రేటు 7.1 శాతం వద్దనే ఉంటుందని గమనించాలి. పీపీఎఫ్‌లో ఎంత మొత్తంలో పెట్టుబడి పెడితే రూ. 40లక్షల డబ్బును సంపాదించగలరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
PPFలో EEE టాక్స్ బెనిఫిట్స్ :
PPFలో ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడితో 15 ఏళ్లలో రూ.40.6 లక్షలు సంపాదిస్తారు. PPFలో మరో అడ్వాంటేజ్ ఏమిటంటే.. EEE పన్ను-ప్రయోజన పెట్టుబడి ఆప్షన్ పరిధిలోకి వస్తుంది. మీ కాంట్రిబ్యూషన్ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. మీరు డిపాజిట్ చేసిన వడ్డీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. మీ మెచ్యూరిటీ మొత్తంపై కూడా ఎలాంటి పన్ను ఉండదు.
ప్రభుత్వ పథకంపై ఆందోళన అక్కర్లేదు :
పెట్టుబడిపై స్థిర రాబడిని కోరుకునే వారికి PPF బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఉండటంతో చాలా మంది PPF రిటైర్మెంట్ ప్లాన్లలో చేర్చుతారు. ఈ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం సపోర్టు ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సురక్షితం కూడా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇందులో పోతుందనే భయం అక్కర్లేదు.
15 ఏళ్లలో పెట్టుబడిపై మెచ్యూరిటీ :
ఆర్థిక సలహాదారులు PPF అకౌంటును రిటైర్మెంట్ ప్లాన్లలో చేర్చడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే.. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ పథకాల రాబడి స్టాక్ మార్కెట్లలోని హెచ్చుతగ్గుదల ఉంటుంది. కానీ, PPFలో మీ పెట్టుబడి స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎఫెక్ట్ కాదు. PPF డబ్బు 15 ఏళ్లలో మెచ్యూరిటీ చెందుతుందని పెట్టుబడిదారులు తప్పక గుర్తుపెట్టుకోవాలి.