×
Ad

మీ ఇంట్లో పట్టు చీర ఉందా.. దాని క్వాలిటీ ఎంతో చెక్ చేసుకోవచ్చు.. బంగారం టైప్‌లో..

వ్యాపారులు వేలాది రూపాయలు తీసుకుని మనకు నాణ్యతలేని పట్టుచీరను అంటగడుతున్నారా? అనే విషయాన్ని తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాం.

Silk Sarees

Silk Sarees: బంగారం కొంటే దాని నాణ్యతను చెక్‌ చేయిస్తాం. చీరలు కొన్నా ఇలాగే నాణ్యతను చెక్‌ చేస్తే ఎలా ఉంటుంది? పట్టు చీరల ధరలు కూడా చాలా ఖరీదుగా ఉంటాయి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పట్టు చీరలు కొంటాం.

మనం ఆశించిన నాణ్యతతోనే అవి ఉంటున్నాయా? లేదంటే వ్యాపారులు వేలాది రూపాయలు తీసుకుని మనకు నాణ్యతలేని పట్టుచీరను అంటగడుతున్నారా? అనే విషయాన్ని తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాం. కొందరు వ్యాపారులు నకిలీ పట్టును నిజమైన పట్టుగానూ నమ్మించి మోసం చేస్తుంటారు.

దీంతో పట్టుచీర ప్రామాణికతను టెస్ట్‌ చేయడానికి ఇప్పుడు స్పెషల్‌ టెస్ట్‌ సెంటర్ ఏర్పాటైంది. టెక్స్‌టైల్‌ విద్యార్థుల సాయంతో అసోం రాజధాని గౌహతిలో ఈ సెంటర్‌ను ఈశాన్య రాష్ట్రాల చేతి వృత్తుల, చేనేత అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసింది.

Also Read: చలికి ఇప్పటికే వణికిపోతున్న ప్రజలు.. ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరగనుందంటూ ఐఎండీ హెచ్చరిక

ఇందులో రూ.100 చెల్లిస్తే చాలు.. మీ పట్టు చీర నకిలీదా? అనే విషయం తెలుసుకోవచ్చు. దీన్ని 2023లో ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ కేంద్రం 30 లక్షలు చీరల నాణ్యతా పరీక్షలను చేసి, సర్టిఫికెట్లు జారీ చేసింది.

చీరల నాణ్యతను పరీక్షించడానికి 3 రకాల విధానాలు ఉన్నాయి. ఇందులోని బర్నింగ్ టెస్ట్ పద్ధతిలో చీరలోని చిన్న దారాన్ని నిప్పు మీద కాల్చుతారు. ఆ సమయంలో వెంట్రుకలు కాల్చితే వచ్చే వాసన రావాలి. అలా జరిగితేనే అది పట్టు చీర అని అర్థం. ఇక మరో విధానం సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ముంచడం. అందులో పట్టు త్వరగా కరిగిపోతుంది.

లేదంటే అది నకిలీ చీరే. ఇక చివరి విధానం మైక్రో స్కోప్ కింద చీరను చూడడం. అలా చూస్తూ దారాల అల్లికలు అన్నీ ఒకే మందంతో, సమాంతరంగా ఉంటాయి. కేవలం రూ.100కే ఈ పరీక్షలు చేస్తుండడంతో పట్టు చీరలు కొనేవారికి ఈ కేంద్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది.