Top 10 Car Loan Banks
Top 10 Car Loan Banks : మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అనేక బ్యాంకులు కార్ల కొనుగోలుపై అద్భుతమైన లోన్లు అందిస్తున్నాయి. వడ్డీ రేటు, ఛార్జీలను (Top 10 Car Loan Banks) వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం, చాలా బ్యాంకులు 7.60శాతం నుంచి 14.25 శాతం వరకు వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తున్నాయి. ఏ బ్యాంకు 5 ఏళ్లకు చౌకైన రూ. 5 లక్షల రుణాన్ని అందిస్తోంది. ఈఎంఐ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1. యూకో బ్యాంక్ :
యూకో బ్యాంక్ అత్యంత చౌకైన ఆప్షన్. కొత్త కారు రుణానికి వడ్డీ రేటు 7.60 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ రూ. 10,043 నుంచి రూ. 10,685 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50శాతం అంటే.. రూ. 5వేలుగా నిర్ణయించింది. వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. కానీ, ఇతర ఫీజులు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.
2. కెనరా బ్యాంక్ :
కెనరా బ్యాంక్ 7.70 శాతం రేటుతో కారు లోన్లను అందిస్తుంది. ఈఎంఐ రూ. 10,067 నుంచి రూ. 11,047 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం అంటే రూ. 1,000 నుంచి రూ. 5వేల వరకు ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ 2025 మధ్య పండుగ ఆఫర్‌లో ఈ రుసుము పూర్తిగా మాఫీ చేస్తుంది. తద్వారా లోన్ చాలా చౌకగా పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 7.70 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ రూ.10,067 నుంచి రూ.11,122 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం గరిష్టంగా రూ.15వేల వరకు ఉండవచ్చు. ప్రస్తుత కస్టమర్లు వడ్డీ రేటులో 0.25 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
4. పంజాబ్, సింధ్ బ్యాంక్ :
ఈ బ్యాంక్ 7.75శాతం రేటుతో రుణం ఇస్తుంది. ఈఎంఐ రూ. 10,078 నుంచి రూ. 11,699 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం అంటే రూ. 1,000 నుంచి రూ. 15వేల వరకు ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే.. “PSB అప్నా వాహన సుగం” పథకంలో ప్రాసెసింగ్ ఫీజుపై 50శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
5. ఇండియన్ బ్యాంక్ :
ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేటు కూడా 7.75శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ రూ. 10,078 నుంచి రూ. 10,587 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 1,000 మాత్రమే. ప్రభుత్వ బ్యాంకు, తక్కువ ఛార్జీలతో సరసమైన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
6. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
యూనియన్ బ్యాంక్ కొత్త కారు రుణాలపై 7.80 శాతం నుంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈఎంఐ రూ. 10,090 నుంచి రూ. 10,550 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కేవలం రూ. 1,000 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, లో-ఈఎంఐ వంటి ఆప్షన్లను కూడా పొందవచ్చు.
7. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) :
పీఎన్‌బీ రేటు 7.85 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ రూ. 10,102 నుంచి రూ. 10,550 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25శాతం, రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది.
ఈ బ్యాంక్ 7.85శాతం వడ్డీ రేటుకు లోన్ ఇస్తుంది. ఈఎంఐ రూ. 10,102 నుంచి రూ. 11,160 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.25 శాతం అంటే రూ. 2,500 నుంచి రూ. 10వేల వరకు ఉంటుంది. వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
9. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
ఎస్బీఐ వడ్డీ రేటు 8.90 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈఎంఐ రూ. 10,355 నుంచి రూ. 10,611 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ. 750 నుంచి రూ. 1,500 వరకు ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ కావడంతో కస్టమర్లు సేల్, సర్వీసు రెండింటినీ పొందవచ్చు.
10. ఐసీఐసీఐ బ్యాంక్ :
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్లు 9.10 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఈఎంఐలు రూ. 10,403 వరకు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది. లోన్ మొత్తంలో 2 శాతం వరకు ఉండవచ్చు. స్పీడ్ ప్రాసెసింగ్, డిజిటల్ పరంగా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు.