Top 10 Cars in October 2023 : అక్టోబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. ఏయే బ్రాండ్ల కార్లు ఉన్నాయంటే?

Top 10 Cars in October 2023 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీల్లో ప్యాసింజర్ వెహికల్ (PV) సెగ్మెంట్‌లో అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. పలు ఆటోమొబైల్ కంపెనీలు అత్యధికంగా 391,472 యూనిట్లతో రికార్డు నెలకొల్పాయి. అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి సుజుకి ఇండియా టాప్ ప్లేసులో నిలిచింది. మొత్తం 10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో 6 మోడళ్లు నిలవగా, ఆ తర్వాత టాటా మోటార్స్ 2 కార్లను కలిగి ఉంది.

Read Also : Good Credit Card Score : గుడ్ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. మీ క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలుసా? ఈ 5 విషయాలు తప్పక పాటించండి!

ఆశ్చర్యకరంగా, మహీంద్రా స్కార్పియో హోల్‌సేల్ డెస్పాచ్‌ల పరంగా హ్యుందాయ్ క్రెటా కన్నా ముందంజలో నిలిచింది. అక్టోబర్‌లో పీవీ వాల్యూమ్‌లో SUV సెగ్మెంట్ 50.7శాతం వాటాను కలిగి ఉండగా, హ్యాచ్‌బ్యాక్ విభాగం 29శాతం వద్ద ఉంది. అక్టోబర్‌లో అమ్ముడైన టాప్ 10 కార్లలో ఐదు ఎస్‌యూవీలు, మూడు హ్యాచ్‌బ్యాక్‌లు, ఒక సెడాన్, ఒక MPV ఉన్నాయి.

మరోసారి బెస్ట్ సెల్లర్‌గా మారుతి వ్యాగన్‌ఆర్ :

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరోసారి అక్టోబర్‌లో 22,080 యూనిట్ల బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ 20,598 యూనిట్లకు చేరుకుంది. టాటా నెక్సాన్ 16,887 యూనిట్లతో ఎస్‌యూవీలలో అగ్రగామిగా నిలిచింది. మారుతి సుజుకి బాలెనో ఆకట్టుకునే అమ్మకాలను అందిస్తోంది. ఈ నెలలో 16,594 యూనిట్లను సాధించింది. మారుతి సుజుకి బ్రెజ్జా 16,050 యూనిట్ల వద్ద వెనుకబడి ఉంది.

Top 10 cars in October 2023 

హ్యుందాయ్ క్రెటా కన్నా మహీంద్రానే :

టాటా పంచ్ చాలా నెలలుగా అదే స్థాయిలో సేల్స్ కొనసాగిస్తోంది. అక్టోబర్‌లో 15,317 యూనిట్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో 14,699 యూనిట్లకు మారుతి సుజుకి డిజైర్ ఏకైక సెడాన్ కాగా, మారుతి సుజుకి ఎర్టిగా 14,209 యూనిట్లకు మాత్రమే ఎంపీవీగా నిలిచింది. మహీంద్రా స్కార్పియో (N క్లాసిక్‌తో సహా) నెలలో 13,578 యూనిట్లను సాధించింది. 13,077 యూనిట్ల వాల్యూమ్‌ను నమోదు చేసిన హ్యుందాయ్ క్రెటా కన్నా ముందంజలో నిలిచింది.

అక్టోబర్ 2023లో టాప్ 10 కార్లు ఇవే :

* మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 22,080 యూనిట్లు
* మారుతి సుజుకి స్విఫ్ట్ – 20,598 యూనిట్లు
* టాటా నెక్సాన్ – 16,887 యూనిట్లు
* మారుతి సుజుకి బాలెనో – 16,594 యూనిట్లు
* మారుతి సుజుకి బ్రెజ్జా – 16,050 యూనిట్లు
* టాటా పంచ్ – 15,317 యూనిట్లు
* మారుతి సుజుకి డిజైర్ – 14,699 యూనిట్లు
* మారుతీ సుజుకి ఎర్టిగా – 14,209 యూనిట్లు
మహీంద్రా స్కార్పియో – 13,578 యూనిట్లు
హ్యుందాయ్ క్రెటా – 13,077 యూనిట్లు

Read Also : Pixel Car Crash Detection : భారత్‌‌లో ఈ పిక్సెల్ ఫోన్లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌.. ఎలా ఎనేబుల్ చేయాలి? అదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు