Pixel Car Crash Detection : భారత్‌‌లో ఈ పిక్సెల్ ఫోన్లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌.. ఎలా ఎనేబుల్ చేయాలి? అదేలా పనిచేస్తుందంటే?

Pixel Car Crash Detection : గూగుల్ ఇటీవల భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ల కోసం కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను విస్తరించింది. ఈ ఫీచర్ తీవ్రమైన ప్రమాదాలను గుర్తించడానికి, అత్యవసర సహాయం కోసం కాల్ చేయడానికి లొకేషన్, మోషన్ సెన్సార్‌లు, పరిసర శబ్దాలను ఉపయోగిస్తుంది.

Pixel Car Crash Detection : భారత్‌‌లో ఈ పిక్సెల్ ఫోన్లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌.. ఎలా ఎనేబుల్ చేయాలి? అదేలా పనిచేస్తుందంటే?

How to enable and use the new Pixel car crash detection feature in India

Updated On : November 3, 2023 / 5:55 PM IST

Pixel Car Crash Detection in India : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) 2022లో ఐఫోన్ (iPhone 14) సిరీస్‌ ద్వారా క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆపిల్ యూజర్లు అప్పటినుంచి తమ ఐఫోన్లు, ఆపిల్ వాచ్‌లలో సెక్యూరిటీ ఫీచర్లను వినియోగిస్తున్నారు. అయితే, అసలు క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ ముందుగా తీసుకొచ్చింది ఆపిల్ కాదు.. గూగుల్ అని తెలుసా? ఈ ఫీచర్‌ని 2019లో గూగుల్ పిక్సెల్ 4లో తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ మొదట్లో ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, ఇప్పుడు ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్, భారత్ యూజర్లకుఅందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఈ సెక్యూరిటీ ఫీచర్ కేవలం Pixel 4a, Pixel 6a, Pixel 7, Pixel 7 Pro, Pixel 7a, Pixel 8, Pixel 8 Pro వంటి నిర్దిష్ట పిక్సెల్ మోడల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లలోని యూజర్ల కోసం.. ఈ కొత్త ఫీచర్ పిక్సెల్ 4ఎ, పిక్సెల్ ఫోల్డ్‌తో సహా అన్ని తదుపరి మోడల్‌లలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంగ్లీష్, డానిష్, డచ్, ఇటాలియన్, జపనీస్, ఇతర భాషలతో సహా 11 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉందని గమనించాలి. దురదృష్టవశాత్తూ, కారు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ హిందీలో ఇంకా అందుబాటులో లేదు. భారత్ సహా మరిన్ని దేశాల్లో ఫీచర్ లభ్యతపై ఇటీవలే ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదించింది.

పిక్సెల్ ఫోన్లలో కార్ క్రాష్ డిటెక్షన్ ఎలా పని చేస్తుంది? :
పిక్సెల్ 4a, ఆ తర్వాతి మోడల్ పిక్సెల్ ఫోన్‌లు, ఫోల్డబుల్ ఫోన్లతో సహా డివైజ్ లొకేషన్, మోషన్ సెన్సార్‌లు, సమీపంలోని సౌండ్‌లను గ్రహిస్తాయి. యూజర్లు ఎవరైనా తీవ్రమైన కారు క్రాష్‌ గురయ్యారో లేదో తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ వర్క్ చేయాలంటే.. కారు క్రాష్ గుర్తింపుకు మీ లొకేషన్, ఫిజికల్ యాక్టివిటీ, మైక్రోఫోన్ యాక్సెస్ అవసరం. మీ ఫోన్ క్రాష్‌ను గుర్తిస్తే.. అది వెంటనే ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేస్తుంది. ఈ కాల్ ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌ని ఉపయోగిస్తుంది. మీ లొకేషన్, ఏమి జరిగింది అనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది.

Read Also : Google Photos Features : గూగుల్‌ ఫొటోస్‌లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్.. మీకిష్టమైన వీడియోలను ఇలా హైలైట్ చేయొచ్చు తెలుసా?

అయినప్పటికీ, అన్ని ఫోన్‌లు అన్ని క్రాష్‌లను గుర్తించలేకపోవచ్చు. కొన్నిసార్లు ఈ ఫీచర్‌ను ఇతర ప్రభావిత శబ్దాలు కూడా గందరగోళానికి గురిచేస్తాయని గూగుల్ హెచ్చరిస్తుంది. కొన్ని సందర్భాల్లో, మీ పిక్సెల్ ఫోన్ అత్యవసర సేవలకు కాల్ చేయలేకపోవచ్చు. ఉదాహరణకు.. మీ ఫోన్ మొబైల్ నెట్‌వర్క్‌ సిగ్నల్ అందకపోవడం లేదా ఫోన్ కాల్‌ మాట్లాడుతున్న సమయంలో కనెక్ట్ అయి ఉండవచ్చునని గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

How to enable and use the new Pixel car crash detection feature in India

new Pixel car crash detection feature in India

క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :
పిక్సెల్ ఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ఎలా ఆన్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
* మీ ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉండాలి. ఎందుకంటే అది పని చేయడానికి కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అవసరం.
* ఫీచర్ ఎనేబలు్ చేయడానికి మీ పిక్సెల్ ఫోన్ ‘Personal Safety’ యాప్‌ను ఓపెన్ చేయండి. మీరు సాధారణంగా ఈ యాప్‌ని మీ యాప్ మేనేజర్‌లో చూడవచ్చు.
* మీ ‘Personal Safety‘ యాప్‌లో ‘Features’ ఆప్షన్ నొక్కండి.
* మీరు ‘Car crash detection’ని కనుగొనే వరకు ఫీచర్ల జాబితాను కిందికి స్క్రోల్ చేయండి. దానిపై Tap చేయండి.
* మీరు ఇప్పుడు కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ‘Setup’ చేసే ఆప్షన్ చూడవచ్చు. సెటప్ ప్రాసస్ ప్రారంభించడానికి దానిపై Tap చేయండి.
* ఫీచర్ సమర్థవంతంగా పని చేయడానికి మీ లొకేషన్ షేర్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. ‘Allow while app is in use’ ఆప్షన్ ట్యాప్ చేయండి. క్రాష్ సమయంలో మీ లొకేషన్ యాక్సెస్ చేయడానికి యాప్‌ని అనుమతిస్తుంది.

ఆ తర్వాత, మీ మైక్రోఫోన్‌ను షేర్ చేయడానికి, మీ ఫిజికల్ యాక్టివిటీని యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది. క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఫుల్ యాక్టివిటీని ఎనేబుల్ చేయడానికి ‘Allow’ బటన్ Tap చేయండి.
అంతే.. మీ పిక్సెల్ ఫోన్ ఇప్పుడు క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ ఎనేబుల్ అయినట్టే.. ప్రమాదకర కార్ క్రాష్ సమయంలో ఆటోమేటిక్‌గా అత్యవసర సేవలకు కాల్ వెళ్లిపోతుంది.

Read Also : Google Samsung Apps : గూగుల్ హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 శాంసంగ్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి!