Top 10 selling cars in March ( Photo : Google)
Top 10 Selling Cars : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruti Suzuki) మార్చి కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మారుతీ సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) మోడల్ ఇతర కంపెనీల అన్ని కార్లను అధిగమించి భారీ స్థాయిలో అమ్మకాలు జరిపింది. ఈ క్రమంలోనే మారుతి స్విఫ్ట్ టాప్ పొజిషన్ దక్కించుకుంది. భారతీయ కార్ల కంపెనీలకు FY23 ఒక గొప్ప ఏడాదిగా చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,889,545 యూనిట్లు అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలు విక్రయించాయి.
ఎప్పటిలాగే, మారుతీ సుజుకి ఇండియా (Maruti Suzuki India) దేశీయ వాల్యూమ్‌ల చార్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai), టాటా మోటార్స్ (Tata Motors) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) మార్చిలో కూడా అద్భుతమైన వాల్యూమ్‌లను అందించారు. ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లలో మారుతి నుంచి ఏడు మోడల్స్ నిలవగా, టాటా నుంచి రెండు, హ్యుందాయ్ నుంచి ఒకటి ఉన్నాయి. అలాగే, 10 కార్లలో 5 స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు (SUVలు) ఉన్నాయి.
మార్చిలో స్విఫ్ట్ జోరు :
మారుతి సుజుకి స్విఫ్ట్ మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మొత్తం 17,559 యూనిట్ల విక్రయాలను సాధించింది. మారుతి సుజుకి వ్యాగన్(R) 17,305 యూనిట్లతో దగ్గరగా నిలిచింది.
అత్యధికంగా అమ్ముడైన SUV Brezza :
టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కన్నా మారుతి సుజుకి (Brezza) కారు మోడల్ 16,227 యూనిట్లతో నెలలో అత్యధికంగా అమ్ముడైన (SUV)గా నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బాలెనో (Baleno) 16,168 యూనిట్లకు చేరుకుంది.
Read Also : Maruti Cars Price Hike : కొత్త కారు కొంటున్నారా? పెరిగిన మారుతి సుజుకి కార్ల ధరలు.. ఎంతో తెలుసా?
ఆ తర్వాతి స్థానాల్లో Nexon, Creta కార్లు :
నెక్సాన్ బ్రెజ్జా కన్నా వెనుకబడి ఉన్నప్పటికీ.. మార్చిలో 14,769 యూనిట్లతో అద్భుతమైన అమ్మకాలను సాధించింది. క్రెటా (Creta) మోడల్ కారు ఈ నెలలో 14,026 యూనిట్ల విక్రయాలతో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Top 10 selling cars in March ( Photo : Google)
డిజైర్ లోన్ సెడాన్ :
మారుతి సుజుకి డిజైర్ కారు 13,394 యూనిట్ల అమ్మకాలను సాధించి 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల స్థానంలో సెడాన్ నిలిచింది. మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) 11,995 యూనిట్ల అమ్మకాలను సాధించింది.
పంచ్, గ్రాండ్ విటారా SUV :
పంచ్ మోడల్ అమ్మకాల్లో అదే జోరు కొనసాగింది. నెమ్మదిగా 10,894 యూనిట్ల విక్రయాలను సాధించింది. గ్రాండ్ విటారా మొదటిసారి టాప్ 10లోకి ప్రవేశించింది. ఒక నెలలో 10వేల యూనిట్ల మార్కును కూడా 10,045 యూనిట్లతో దాటేసింది.
మార్చిలో అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే :
1. మారుతి సుజుకి స్విఫ్ట్ – 17,559 యూనిట్లు
2. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ – 17,305 యూనిట్లు
3. మారుతి సుజుకి బ్రెజ్జా – 16,227 యూనిట్లు
4. మారుతి సుజుకి బాలెనో – 16,168 యూనిట్లు
5. టాటా నెక్సాన్ – 14,769 యూనిట్లు
6. హ్యుందాయ్ క్రెటా – 14,026 యూనిట్లు
7. మారుతి సుజుకి డిజైర్ – 13,394 యూనిట్లు
8. మారుతి సుజుకి ఈకో – 11,995 యూనిట్లు
9. టాటా పంచ్ – 10,894 యూనిట్లు
10. మారుతి సుజుకి గ్రాండ్ విటారా – 10,045 యూనిట్లు