×
Ad

2025 Year-End Car Deals : కొంటే కొత్త కారు ఇప్పుడే కొనేసుకోండి.. ఈ 3 రెనాల్ట్ కార్లపై బంపర్ డిస్కౌంట్లు.. రూ. 1.05 లక్షల వరకు ఆదా..!

2025 Year-End Car Deals : రెనాల్ట్ ఇండియా డిసెంబర్ 2025లో ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా కిగర్, ట్రైబర్ క్విడ్‌లపై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి ఆఫర్ల వివరాలివే..

1/7
2025 Year-End Car Deals : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ఇంతకన్నా బెటర్ టైమ్ మరొకటి ఉండదు. రెనాల్ట్ ఇండియా ఈ ఏడాది చివరి నెలలో మొత్తం పోర్ట్‌ఫోలియోలో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందులో ప్రీ-ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ మోడళ్ల మిగిలిన స్టాక్‌లను క్లియర్ చేస్తోంది.
2/7
ఆటోమేకర్ ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ రివార్డులు, రిలైవ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది. మోడల్, వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులకు భారీగా సేవింగ్స్ అందిస్తోంది. మీరు కూడా కొత్త రెనాల్ట్ కారును తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.
3/7
రూ. 1.05 లక్షల సేవింగ్ : పండుగ సీజన్‌లో భారీ అమ్మకాల తర్వాత ఆటో దిగ్గజం అమ్మకాలను మరింత పెంచేందుకు డిసెంబర్ 2025లో అతిపెద్ద ఆఫర్‌లను ప్రకటించింది. ఆఫర్‌ల జాబితా ప్రకారం.. ఈ నెలలో కిగర్ అత్యధిక బెనిఫిట్స్ అందిస్తోంది. ఫేస్‌లిఫ్ట్‌కు ముందు MY2025 కిగర్ అత్యధిక సేవింగ్స్ పొందుతోంది. దాదాపు రూ. 1.05 లక్షలకు చేరుకుంది.
4/7
రెనాల్ట్ ట్రైబర్‌పై భారీ డిస్కౌంట్ : ఈ బెనిఫిట్స్ ద్వారా నేరుగా క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ స్క్రాపేజ్ బోనస్‌లు ఉన్నాయి. ఫేస్‌లిఫ్టెడ్ కిగర్ ఇప్పటికీ భారీ సేవింగ్స్ అందిస్తుంది. అయినప్పటికీ రూ. 85వేలకు పరిమితమైంది. కిగర్‌తో పాటు, రెనాల్ట్ ట్రైబర్ రేంజ్ కూడా సంవత్సరాంతపు డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. కొన్ని డీలర్‌షిప్‌లు ఇప్పటికీ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ MY2025 ట్రైబర్ స్టాక్‌ ఉండగా ఈ యూనిట్లు మొత్తం రూ. 95వేల వరకు బెనిఫిట్స్ అందిస్తాయి.
5/7
రూ. 80వేలు సేవింగ్ : రెనాల్ట్ ట్రైబర్ అప్‌డేట్స్ సేవింగ్స్ కొంచెం లిమిటెడ్‌గానే ఉంటాయి. వేరియంట్, నగర లభ్యతను బట్టి రూ. 80వేల వరకు చేరుకుంటాయి. కిగర్, ట్రైబర్ క్రింద క్విడ్ రెనాల్ట్ అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచింది. ఈ డిసెంబర్‌లో కొనుగోలుదారులు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ అలవెన్సులు, అదనపు స్క్రాపేజ్ సేవింగ్స్‌తో సహా రూ. 70వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
6/7
పాత స్టాక్ సహజంగానే అధిక డిస్కౌంట్లతో వస్తుంది. అయితే, ఇటీవల అప్‌డేట్ చేసిన వేరియంట్‌లు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు కారు కొనాలని చూస్తుంటే ఏ వేరియంట్‌లు ఎక్కువ డిస్కౌంట్లను అందిస్తున్నాయో మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.
7/7
త్వరలో కొత్త మిడ్-సైజ్ SUV లాంచ్ : ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ జనవరి 2026లో స్థానిక మార్కెట్‌కు సరికొత్త మిడ్ రేంజ్ SUVని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. CMF-B ప్లాట్‌ఫామ్ ఆధారంగా నెక్స్ట్ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.