Top Brand Smart TVs
Top Brand Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ప్రముఖ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో బ్లాక్ ఫ్రై సేల్ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో కొనుగోలుదారులు బిగ్ స్క్రీన్ స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయవచ్చు.
అంతేకాదు.. టాప్ బ్రాండ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై (Top Brand Smart TVs) అదిరిపోయే డీల్స్‌తో కొనుగోలు చేయవచ్చు. మీరు సోనీ, శాంసంగ్ వంటి ప్రీమియం బ్రాండ్‌ల నుంచి అనేక స్మార్ట్ టీవీలను బంపర్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలపై బెస్ట్ వాల్యూ ధర డీల్స్ షార్ట్‌లిస్ట్ ఓసారి పరిశీలిద్దాం.
రియల్‌మి టెక్‌లైఫ్ (65-అంగుళాల) QLED అల్ట్రా HD :
రియల్‌మి 65-అంగుళాల స్మార్ట్ టీవీ. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో కేవలం రూ. 38,699కి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టీవీ 55శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో అదనంగా రూ. 1,000 తగ్గింపు కూడా పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
టీసీఎల్ (65 అంగుళాలు) మెటాలిక్ బెజెల్ లెస్ సిరీస్ 4K :
ఈ జాబితాలో TCL నుంచి 65-అంగుళాల టీవీ కూడా ఉంది. అమెజాన్‌లో 63శాతం తగ్గింపుతో రూ. 45,990కు లభిస్తుంది. అదనంగా, కంపెనీ ఈ టీవీపై అదిరిపోయే బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్‌తో రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.
సోనీ బ్రావియా 2 (65 అంగుళాలు) అల్ట్రా HD (4K) :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 65-అంగుళాల సోనీ స్మార్ట్ టీవీ రూ. 66,990కు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌టీవీపై అద్భుతమైన బ్యాంక్ ఆఫర్ అందిస్తోంది. అదనంగా, కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లతో రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐ ఆప్షన్‌తో రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ క్రిస్టల్ 4K వివిడ్ (65-అంగుళాల) అల్ట్రా HD :
ఈ జాబితాలో 65-అంగుళాల డిస్‌ప్లేతో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ లభ్యమవుతుంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ శాంసంగ్ టీవీని కేవలం రూ. 57,990కి అందిస్తోంది. అంటే 33శాతం తగ్గింపు అందిస్తోంది. ఇది మాత్రమే కాదు.. ఈ టీవీలన్నింటికీ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్‌తో రూ. 1,250 తగ్గింపు పొందవచ్చు.