ఈ కంపెనీ ఏడాదికి ఒక్కో ఉద్యోగిపై రూ.21 కోట్లు సంపాదిస్తుంది తెలుసా? ఏ కంపెనీ ఎంతో ఫుల్ లిస్ట్..

ఆపిల్, ఎన్విడీయా, టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచంలోని పలు కంపెనీలు ఒక్కో ఉద్యోగిని వాడుకుని కోట్లాది రూపాయల చొప్పున ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ 2017 నుంచి 2022 వరకు తన సబ్‌స్క్రిప్షన్లను రెట్టింపు చేసుకుంది.

ఆ కంపెనీ ప్రతి ఉద్యోగి ద్వారా ఏడాదికి రూ.21.58 కోట్ల ($2.5 మిలియన్) ఆదాయం పొందుతోంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో పలు సంస్థలు ఇలా తమ ఉద్యోగుల ద్వారా ఆశ్చర్యకరమైన స్థాయిలో ఇంత మొత్తంలో ఆదాయం పొందుతున్నాయి. తక్కువ మంది ఉద్యోగులతోనే భారీగా ఆదాయాన్ని రాబట్టే ఈ కంపెనీలు అనేక పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇటువంటి కంపెనీల జాబితాలో ఆపిల్ (Apple), మెటా, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), ఊబర్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. ఉద్యోగుల నుంచి ఈ కంపెనీలు పొందే సగటు ఆదాయం కూడా కోట్ల రూపాయల్లోనే ఉంది. ఈ కంపెనీలు ఉద్యోగుల నైపుణ్యాలపై పెట్టుబడి పెట్టి, తక్కువ మానవ వనరులతో ఎక్కువ ఆదాయాన్ని ఎలా పొందాలో నిరూపిస్తున్నాయి.

Also Read: పాకిస్థాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అప్పట్లో ఇజ్రాయెల్ ఎందుకు అడ్డుకోలేకపోయింది..? అందుకు ఇండియానే కారణమా..? ఆ సమయంలో అసలేం జరిగిందంటే..

ఏయే కంపెనీ ఒక్కో ఉద్యోగి నుంచి ఎంతెంత ఆదాయం పొందుతోంది?

ర్యాంక్ కంపెనీ ఉద్యోగి నుంచి పొందే ఆదాయం
1 నెట్‌ఫ్లిక్స్ రూ.21,58,48,760
2 ఆపిల్ రూ.20,33,11,713
మెటా (ఫేస్‌బుక్) రూ.14,11,77,148
4 ఆల్ఫాబెట్ (గూగుల్) రూ.13,34,09,799
5 ఊబర్ రూ.9,56,57,996
6 ఎన్విడీయా రూ.9,54,52,318
7 మైక్రోసాఫ్ట్ రూ.8,79,63,643
8 టెస్లా రూ.6,58,48,376
9 అడోబ్ రూ.6,10,02,089
10 సెల్స్‌ఫోర్స్ రూ.4,61,39,611
11 ఇంటెల్ రూ.4,54,03,084
12 అమెజాన్ రూ.3,70,35,709
13 ఒరాకిల్ రూ.2,44,26,625
14 ఐబీఎం రూ.1,81,93,514

Note: ఈ గణాంకాలను ఫోర్బ్స్ గ్లోబల్ తాజా నివేదిక ఆధారంగా ఇచ్చాం.