పాకిస్థాన్ ను దెబ్బ కొడదామన్న ఇజ్రాయెల్.. ఇండియా కూడా ఓకే.. కానీ.. ఆ టైమ్ లో ఏం జరిగింది?

ఇజ్రాయెల్ కు పాకిస్థాన్ కూడా శత్రువే. పాకిస్థాన్ అణ్వాస్త్రదేశంగా ఉంది. అయితే, అప్పట్లో పాకిస్థాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయలేదు..? పాకిస్థాన్ లో అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకోలేక పోయింది..

పాకిస్థాన్ ను దెబ్బ కొడదామన్న ఇజ్రాయెల్.. ఇండియా కూడా ఓకే.. కానీ.. ఆ టైమ్ లో ఏం జరిగింది?

India

Updated On : June 22, 2025 / 5:05 PM IST

Pak-Israel: ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఆ దేశంపై వార్ ప్రకటించింది. కొద్దిరోజులుగా వరుస బాంబులతో ఇరాన్ పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతుంది. ఆ దేశంలోని అణు స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. అమెరికా సహకారంతో ఈ దాడులు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణ్వాస్త్ర దేశంగా మారకూడదని, అలా జరిగితే తమ దేశానికి ముప్పు పొంచిఉన్నట్లేనని ఇజ్రాయెల్ భావించి దాడులకు పాల్పడుతోంది. ఇప్పుడేకాదు.. గతంలోనూ ఇరాన్ పై ఇజ్రాయెల్ ఇదేతరహా దాడులు చేసింది.

Also Read: ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు ఇదే.. 13,000 కేజీల బరువు.. భూమి లోపల 200 అడుగుల లోతుకి దూసుకెళ్లి.. అప్పుడు..

1981లో ఇరాన్ నిర్మిస్తున్న అణుకేంద్రాలపై దాడి చేయడంతో అనంతర కాలంలో ఇరాన్ ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదు. గతంలో సిరియాలోని అణుకేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. తమ దేశానికి ముప్పుగా పరిణమించే ఎలాంటి అంశాన్నైనా ఇజ్రాయెల్ వదిలిపెట్టదు. ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ అణుస్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే, ఇజ్రాయెల్ కు పాకిస్థాన్ కూడా శత్రువే. పాకిస్థాన్ అణ్వాస్త్రదేశంగా ఉంది. అయితే, అప్పట్లో పాకిస్థాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయలేదు..? పాకిస్థాన్ లో అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకోలేదనేది చాలామందిలో తలెత్తేప్రశ్న. ఇజ్రాయెల్ పాకిస్థాన్ లో అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అప్పట్లో ప్రయత్నాలు చేసింది. అందుకు భారత సహకారంకోరింది. అయితే, భారతదేశం కొన్ని కారణాల వల్ల ఇజ్రాయెల్ ప్రతిపాదనను పక్కన పెట్టింది. దీంతో పాకిస్థాన్ అణ్వాస్త్ర దేశంగా అవతరించింది.

పాకిస్థాన్‌లో అణ్వస్త్ర కార్యక్రమంను అడ్డుకోవాలని ఇజ్రాయెల్ భారతదేశాన్ని సంప్రదించింది. అయితే, అనేక కారణాల వల్ల ఇజ్రాయెల్ ప్రతిపాదనను భారత్ పక్కన పెట్టాల్సి వచ్చింది. 1970-80ల మధ్య పాకిస్థాన్ అణ్వస్త్ర కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. దాన్ని అడ్డుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు శత్రువైన భారత్‌ను 1978లో ఇజ్రాయెల్ సంప్రదించింది. పాకిస్థాన్ అణ్వస్త్ర కార్యక్రమంను అడ్డుకోవాలని కోరింది. అందుకు అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ అంగీకరించలేదు. 1980లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని ఇజ్రాయెల్ సంప్రదించింది. ఇజ్రాయెల్ ప్రతిపాదనను ఇందిరాగాంధీ అంగీకరించింది. పాకిస్థాన్ అణ్వాస్త్ర కేంద్రంపై దాడులు చేసేందుకు అన్నివిధాల భారత్ సన్నద్ధమైంది. అయితే, చివరి నిమిషంలో దాడికి భారత్ వెనక్కు తగ్గింది.

భారత్, ఇజ్రాయెల్ కలిసి తమపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయని గ్రహించిన పాకిస్థాన్ అప్పట్లో అమెరికాను సంప్రదించింది. అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్థాన్ పై దాడికి భారత్ వెనకడుగు వేసిందన్న వాదన ఉంది. అప్పట్లో ఉన్న పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పై దాడిచేస్తే యుద్ధానికి దారితీయవచ్చునని.. అలా జరిగితే దేశానికే ప్రమాదం పొంచి ఉంటుందని అప్పటి ప్రభుత్వం భావించి పాక్ పై దాడులకు వెనకడుగు వేసిందన్న వాదన ఉంది. దీంతో ఇజ్రాయెల్ సైతం ఏం చేయలేకపోయింది. ఫలితంగా తరువాతి కాలంలో పాకిస్థాన్ అణు కార్యక్రమం రహస్యంగా జరిగింది. చివరకు 1998లో మన అణుపరీక్ష అనంతరం పాకిస్థాన్ కూడా అణుపరీక్ష నిర్వహించింది.