×
Ad

TV Price Hike : టీవీ కొనాలంటే ఇప్పుడే కొనుక్కోండి..! వచ్చే ఏడాది నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకంటే?

TV Price Hike :  కొత్త టీవీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? కొత్త సంవత్సరంలో కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే,

TV Price Hike

TV Price Hike :  కొత్త టీవీ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? కొత్త సంవత్సరంలో కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే, మీకు షాకింగ్ న్యూస్. కొత్త టీవీలు కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఏడాది చివరి నాటికి కొనుగోలు చేసుకోవటం మంచిది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి టీవీల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందట. అయితే, ధరలు ఎందుకు పెరుగుతాయనే డౌట్ మీకు రావొచ్చు.. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Also Read : Engineering students : ఇంజినీరింగ్ విద్యా విధానంలో ఏఐసీటీఈ భారీ మార్పులు.. జాబ్ చేస్తూనే బీటెక్ చదువొచ్చు.. కీలక మార్పులివే..

2026 జనవరి నెల నుంచి టీవీల ధరలు 3 నుంచి 4శాతం మేర పెరగనున్నాయి. మెమరీ చిప్ ల ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గిపోవడంతో ఎల్‌ఈడీ టీవీ రేట్లు పెంచడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయట. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ 90 దాటిన విషయం తెలిసిందే. దీంతో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి.

ఎల్‌ఈడీ టీవీల తయారీ కేవలం 30శాతం పార్టులు మాత్రమే దేశంలో దొరుకుతున్నాయి. మిగిలిన 70శాతం పార్టుల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పడిపోవటంతో వీటి దిగుమతులు భారీగా మారాయి.

విదేశాల నుంచి ఎక్కువగా ఓపెన్ సెల్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డు వంటివి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా మెమరీ చిప్ ల కొరత ఏర్పడింది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌లు అవసరం. చిప్‌ల తయారీ కంపెనీలు ఏఐ చిప్‌లపై దృష్టి పెట్టడంతో టీవీలకు సరఫరా పడిపోయింది. ఫలితంగా డీఆర్ఏఎం, ప్లాష్ వంటి మెమరీ పార్టుల ధరలు విపరీతంగా పెరిగాయి.