×
Ad

Union Budget 2026 : టాక్స్ పేయర్లలో టెన్షన్.. 12 ఏళ్లుగా రూ.1.5 లక్షలే.. ఈసారైనా బడ్జెట్‌లో 80C పరిమితి రూ.3.50 లక్షలకు పెరుగుతుందా?

Union Budget 2026 : 2026 సాధారణ బడ్జెట్‌లో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

80C deduction limit increase ( Generated By Gemini AI )

Union Budget 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. బడ్జెట్ 2026 సమీపిస్తున్న కొద్దీ టాక్స్ పేయర్లలో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఈసారి వచ్చే వార్షిక బడ్జెట్‌పై భారీ అంచనాలను పెట్టుకున్నారు. 12ఏళ్లుగా రూ. 1. 5 లక్షల వద్దే నిలిచిపోయిన సెక్షన్ 80C డిడెక్షన్ లిమిట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C డిడెక్షన్ పరిమితి కూడా బడ్జెట్ ప్రధాన అంచనాల్లో ఒకటి. దీనికి సంబంధించి పీపీఎఫ్, ఈఎల్‌ఎస్ఎస్ (ELSS), లైఫ్ ఇన్సూరెన్స్, NSC వంటి వివిధ సేవింగ్స్ స్కీమ్‌లలో వ్యక్తిగత పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు.

ఈ బడ్జెట్‌లో టాక్స్ పేయర్లకు రిలీఫ్ ఉంటుందా? :
నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద డిడెక్షన్ లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచవచ్చు. డిడెక్షన్ లిమిట్ నిజంగా పెంచితే.. పాత పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు వరంగా మారుతుంది.

బడ్జెట్‌కు ముందు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న గృహ ఖర్చుల నేపథ్యంలో పన్ను ఆదాకు సంబంధించి తగ్గింపులపై దీర్ఘకాల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందా? లేదా అని పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

80C deduction limit  (Image Credit To Original Source)

సెక్షన్ 80C ఏంటి? ఎందుకు ముఖ్యమంటే? :
సెక్షన్ 80C పాత పన్ను వ్యవస్థను ఎంచుకునే పన్ను చెల్లింపుదారులు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS), జీవిత బీమా ప్రీమియంలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSCలు) కొన్ని పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్ వంటి సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడులపై డిడెక్షన్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, సెక్షన్ 80C కింద గరిష్ట మినహాయింపు ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలకు పరిమితం చేసింది.

Read Also : Union Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో రైతులకు వరాలు? పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెంపు? రైతన్నల డిమాండ్లు ఇవే..!

గతంలో చివరిసారిగా 2014 బడ్జెట్‌లో సవరించారు. అంటే.. 12 ఏళ్లు గడిచినా అది రూ. 1.5 లక్షల వద్దే నిలిచిపోయింది. ఈ కాలంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, భీమా, పదవీ విరమణ ప్లాన్లకు సంబంధించిన ఖర్చులు వేగంగా పెరిగాయి. దాంతో తక్కువ డిడెక్షన్ లిమిట్ పన్ను చెల్లింపుదారులు కూడా ప్రయోజనం పొందలేరు.

80C పరిమితిని ప్రభుత్వం పెంచుతుందా? :
సెక్షన్ 80C డిడెక్షన్ లిమిట్ పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ సంస్థలు, పన్ను నిపుణుల సపోర్టుతో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా (AMCHAM), సెక్షన్ 80C లిమిట్ రూ. 3.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది.

AMCHAM ప్రకారం.. జీతం పొందే నిపుణులు, పన్ను ఆదా పెట్టుబడులపై ఎక్కువగా ఆధారపడే మధ్య-ఆదాయ కుటుంబాలకు నేరుగా ప్రయోజనం అందుతుంది. డిడెక్షన్ లిమిట్ పెంచడం ద్వారా పన్నుపై విధించే ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా చేతిలో ఎక్కువ డబ్బు నిలుస్తుంది. అప్పుడు లాంగ్ టైమ్ సేవింగ్స్ చేసుకోవచ్చు.