ఈ 19 చిన్న నేరాలకు శిక్షవద్దు!

  • Published By: dharani ,Published On : June 11, 2020 / 04:54 AM IST
ఈ 19 చిన్న నేరాలకు శిక్షవద్దు!

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా తల్లడిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని ఉల్లంఘనలను క్రిమినల్‌ చర్యల నుంచి తప్పించడంపై దృష్టి సారించింది. అకౌంట్ లో బ్యాలెన్స్‌ లేక చెక్‌ బౌన్స్‌ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన మొదలైన చిన్నపాటి నేరాలను డీక్రిమినలైజ్‌ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్‌ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నిర్దిష్ట సెక్షన్‌ పరిధిలో ఏ నేరాలను క్రిమినల్‌ నేరాల కింద కొనసాగించాలి, ఏ నేరాలను డీక్రిమినలైజ్‌ చేయొచ్చు అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. 

ఉల్లంఘనల లిస్ట్ సిద్ధం: 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత నెలలోనే చిన్నపాటి ఉల్లంఘనలను డీక్రిమినలైజ్‌ చేసే అంశాన్ని ప్రస్తావించారు. దీనికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక సర్వీసుల శాఖ వివిధ చట్టాల్లో డీక్రిమినలైజ్‌ చేయతగిన చిన్న స్థాయి ఉల్లంఘనల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ 1881లోని సెక్షన్‌ 138 కింద ఖాతాలో తగిన బ్యాలెన్స్‌ లేక చెక్‌ బౌన్స్‌ అయితే దాన్ని జారీ చేసిన వ్యక్తి నేరం చేసినట్లు అని.. రెండేళ్ల దాకా జైలు శిక్ష విధించవచ్చని తెలిపారు. అంతేకాదు LIC విషయానికొస్తే ఆ సంస్థ పత్రాలు, అకౌంట్లు లేదా ప్రాపర్టీ ఏదైనా చట్టవిరుద్ధంగా ఎవరైనా తమ వద్ద ఉంచుకుంటే ఏడాది దాకా జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా విధించే అవకాశం ఉంది.  

ఆర్థిక శాఖ నేరం కాదని చెబుతున్న చట్టాలు ఇవే..
* ఇన్సురెన్స్ యాక్ట్
* చెక్‌ బౌన్స్ 
* బ్యాంకు రుణాల రీపేమెంట్‌పరమైన ఉల్లంఘనలు 
*  NHB ళీ బ్యాంకింగ్‌ నియంత్రణ
* ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్
* చిట్‌ ఫండ్స్‌ ళీ యాక్చువేరీస్‌
* జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ 
* అనియంత్రిత డిపాజిట్‌ స్కీముల నిషేధ చట్టం 
* డీఐసీజీసీ ళీ నాబార్డ్‌ ళీ  బీమా చట్టం 
* ప్రైజ్‌ చిట్స్, మనీ సర్క్యులేషన్‌ స్కీమ్స్‌ (నిషేధ) 
* పేమెంట్‌ అండ్‌ సెటిల్మెంట్స్‌ సిస్టమ్స్‌ యాక్ట్‌ 
* స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్స్‌ 
* క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీస్‌ (నియంత్రణ) 
* ఫ్యాక్టరింగ్‌ నియంత్రణ చట్టం