Ola electric S1X Launch : 2024 ఓలా ఎలక్ట్రిక్ S1X అప్‌డేట్ వెర్షన్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఏప్రిల్ 15నే లాంచ్..!

Ola electric S1X Launch : ఏప్రిల్ 15న 2024 ఓలా ఎలక్ట్రిక్ S1X అప్‌డేట్ వెర్షన్ స్కూటర్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అదే రోజున ప్రకటించనుంది.

Ola electric S1X Launch : బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఏప్రిల్ 15న ఓలా S1X కొత్త అప్‌డేట్ వెర్షన్ లాంచ్ చేయనున్నట్టు ట్విట్టర్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. కంపెనీ సీఈఓ ట్వీట్ ప్రకారం.. ఓలా S1X రేంజ్ స్కూటర్లు ఓలా S1 ప్రో, ఎయిర్ మోడల్‌ల నుంచి కొన్ని ఫీచర్లతో రానున్నాయి.

Read Also : Bajaj Pulsar N250 : బజాజ్ ఆటో నుంచి సరికొత్త పల్సర్ N250 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, కొత్త ధర ఎంతో తెలుసా?

అదనంగా, ఇప్పుడు ఫిజికల్ కీని కూడా కలిగి ఉంది. తద్వారా కొంచెం గందరగోళంగా ఉన్న సెక్యూరిటీ కోడ్ లాక్/అన్‌లాక్ ఆప్షన్ గతంలోని మాదిరిగా ఉండవచ్చు. డిజైన్ వారీగా ట్వీట్‌లో వెల్లడించిన స్కూటర్‌లు ఎలాంటి మార్పులు లేవని చెప్పవచ్చు. అయితే, ఒలా ఎక్కువగా కొత్త కలర్ ఆప్షన్‌లను మిక్స్‌లో ప్రవేశపెడుతోంది. ఈ ఓలా S1X వెర్షన్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం రోజున ప్రకటించనున్నట్టు భవిష్ వెల్లడించారు.

ఓలా S1X స్కూటర్ వేరియంట్ల ధరలివే :
ప్రస్తుతానికి ఓలా S1X స్కూటర్ రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది. అందులో S1X, S1X+ రెండు వేరియంట్లు మొత్తం 4kWh, 3kWh, 2 kWh అనే మూడు బ్యాటరీ లతో అందుబాటులో ఉన్నాయి. ఓలా S1X (2kWh) వేరియంట్‌తో ధరలు రూ.80వేల నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత మిడ్-స్పెక్ ఓలా S1X+ వేరియంట్ 3kWh బ్యాటరీ టైప్ ధర రూ. 85వేలు, 4kWh బ్యాటరీ టైప్ టాప్-ఆఫ్-లైన్ ఓలా S1X ధర రూ.1.10 లక్షల (అన్ని ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు.

కొత్త ఫీచర్లతో ఓలా S1X రేంజ్ ధరలు ప్రస్తుత రేంజ్ కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఫేమ్-2 సబ్సిడీ స్కీమ్ కూడా గడువు కూడా ముగిసిపోయింది. దానికి బదులుగా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ప్రారంభమైంది. దీనిలో ఫేమ్-2తో పోలిస్తే.. పరిమిత సబ్సిడీ రేటు మాత్రమే ఉంది. అన్ని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు బారీగా పెరిగే అవకాశం ఉంది.

Read Also : Xiaomi 14 Ultra Sale : భారత్‌లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు