Xiaomi 14 Ultra Sale : భారత్‌లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Xiaomi 14 Ultra First Sale : షావోమీ 14 అల్ట్రా భారీ కెమెరా మాడ్యూల్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ, మల్టీ ఛార్జింగ్ సామర్థ్యాలతో 5300ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Xiaomi 14 Ultra Sale : భారత్‌లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Xiaomi 14 Ultra first sale in India today_ Price, specifications

Xiaomi 14 Ultra First Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త షావోమీ14 అల్ట్రా ఫోన్ అమ్మకానికి రెడీగా ఉంది. భారత మార్కెట్లో షావోమీ 14 అల్ట్రా ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ అయింది.

షావోమీ 14 అల్ట్రాలో బ్యాక్ సైడ్ భారీ కెమెరా మాడ్యూల్ హై-ఎండ్ కెమెరాలను కలిగి ఉంది. అంతేకాదు.. ఈ డివైజ్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ, 16జీబీ ర్యామ్, 90డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్‌లెస్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలతో అందుబాటులో ఉంది. ఈ షావోమీ స్మార్ట్‌ఫోన్ 5300ఎంఎహెచ్ బ్యాటరీతో రన్ అవుతుంది.

Read Also : Apple Warn iPhone Users : మెర్సిన‌రీ స్పైవేర్‌ అటాక్.. భారత్ సహా 92 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరిక..!

షావోమీ 14 అల్ట్రా ధర ఎంతంటే? :
షావోమీ 14 అల్ట్రా ఫోన్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని కలిగిన మోడల్‌ రూ. 99,999 ప్రారంభ ధర వద్ద లాంచ్ అయింది. ఔత్సాహిక కొనుగోలుదారులు ఈ డివైజ్‌ను ఈరోజు నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ కోసం అడ్వాన్స్ పేమెంట్ రూ. 9,999 చెల్లించాలి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, వన్‌ప్లస్ 12 వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా షావోమీ 14 అల్ట్రా ఫోన్ భారత మార్కెట్లో ఏప్రిల్ 11న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమైంది.

షావోమీ 14 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు :
షావోమీ 14 అల్ట్రా ఫోన్ 3,200 x 1,440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో అద్భుతమైన 6.73-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ మైక్రో-కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ గరిష్టంగా 120హెచ్‌జెడ్, గరిష్ట ప్రకాశంతో 3,000నిట్‌లు దృశ్యాలను అందిస్తాయి. అన్ని వైపుల నుంచి డివైజ్ డిస్‌ప్లే, షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. ఈ పవర్‌హౌస్‌కు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

గరిష్టంగా 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. వినియోగదారులు వేగవంతమైన స్టోరేజీ సామర్థ్యాన్ని పొందవచ్చు. ఈ డివైజ్ సున్నితమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ఓఎస్‌లో రన్ అవుతుంది.

క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 1-అంగుళాల 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ900 ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది. బ్లర్-ఫ్రీ ఇమేజ్‌లను తీయొచ్చు. రెండు అదనపు 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్858 సెన్సార్‌లు 3.2ఎక్స్, 5ఎక్స్ ప్రత్యేక ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఫోకల్ పొడవు వరుసగా 75ఎమ్ఎమ్, 120ఎమ్ఎమ్ కలిగి ఉంది.

నాల్గవ 50ఎంపీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 32ఎంపీ ఫ్రంట్ సెన్సార్ కలిగి ఉంది. షావోమీ 14 అల్ట్రా అనేది బలమైన 5300ఎంఎహెచ్ బ్యాటరీ. 90డబ్ల్యూ వైర్డు, 80డబ్ల్యూ వైర్‌లెస్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలతో వస్తుంది. రోజంతా అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుంది. అదనంగా, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ భద్రతను అందిస్తుంది. ఐపీ68 రేటింగ్‌ కలిగి ఉంది.

Read Also : Bajaj Pulsar N250 : బజాజ్ ఆటో నుంచి సరికొత్త పల్సర్ N250 బైక్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, కొత్త ధర ఎంతో తెలుసా?